త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assembly Session | ద‌ళితులు ఆందోళ‌న చేస్తే శుద్ధి చేస్తారా? .. మంత్రి అడ్లూరి ఆగ్ర‌హం..

Assembly Session | మూడో రోడు అసెంబ్లీ స‌మావేశాలు (Assembly Session) ప్రారంభ‌మ‌య్యాయి. బీఆర్ఎస్ (BRS) నిర‌స‌న‌ల‌తో అసెంబ్లీలో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. మ‌హిళా శాస‌న‌స‌భ్యుల‌పై పోలీసుల తీరుపై చ‌ర్చించాల్సిందేన‌ని, ప్ర‌తిప‌క్ష నేత చావును కోరుకున్న ఎమ్మెల్యేపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీక‌ర్ పోడియాన్ని చుట్టుముట్టారు.

G

Telangana | Published On Sep 9, 2026, 10.49 am IST

Assembly Session | ద‌ళితులు ఆందోళ‌న చేస్తే శుద్ధి చేస్తారా? .. మంత్రి అడ్లూరి ఆగ్ర‌హం..
Advertisement

Assembly Session | త్రినేత్ర‌.న్యూస్‌: మూడో రోడు అసెంబ్లీ స‌మావేశాలు (Assembly Session) ప్రారంభ‌మ‌య్యాయి. బీఆర్ఎస్ (BRS) నిర‌స‌న‌ల‌తో అసెంబ్లీలో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. మ‌హిళా శాస‌న‌స‌భ్యుల‌పై పోలీసుల తీరుపై చ‌ర్చించాల్సిందేన‌ని, ప్ర‌తిప‌క్ష నేత చావును కోరుకున్న ఎమ్మెల్యేపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీక‌ర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌, ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎర్ర‌వెల్లిలోని కేసీఆర్ (KCR) ఫామ్‌హౌస్ (Farm House) స‌మీపంలోని ర‌హ‌దారుల‌ను శుద్ధి (Purification) చేయ‌డంపై మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ (Adluri Lakshman) మండిప‌డ్డారు. తెలంగాణ సాధించుకున్న త‌ర్వాత కూడా ఎస్సీల‌పై వివ‌క్ష చూపుతున్నార‌ని ఆరోపించారు. శుద్ధి పేరుతో బీఆర్ఎస్ నేత‌లు చేసిన ప‌నికి ఏం స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. ద‌ళితులు రోడ్డుపై న‌డిచార‌ని ప‌సుపు నీళ్ల‌తో శుద్ధీక‌ర‌ణ చేస్తారా అని ప్ర‌శ్నించారు. ద‌ళితుల‌పై ఇంకా ఎన్నాళ్లు దాడులు చేస్తార‌ని ధ్వ‌జ‌మెత్తారు. బీఆర్ఎస్ పార్టీ ద‌ళితుల‌ను అవ‌మానించింద‌న్నారు. ఎర్ర‌వ‌ల్లిలో శుద్ధి ఘ‌ట‌న‌పై చ‌ర్చ జ‌ర‌గాల‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ తెచ్చుకున్న‌ది దీనికోసమేనా? అని ప్ర‌శ్నించారు.

సభాపతికి చేయాల్సిన అవమానాలన్నీ చేశారు: భట్టి విక్రమార్క

సభాపతికి చేయాల్సిన అవమానాలన్నీ బీఆర్‌ఎస్‌ నేతలు చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆరోపించారు. అవమానాలను కొనసాగించే పరిస్థితి మానుకోవాలని కోరుతున్నానన్నారు. సభాపతి సూచన చేస్తే వాదన పెట్టుకోకుండా సజావుగా నడిచేలా చూడాలని సూచించారు. పసుపు నీటితో శుద్ధి చేసి అవమానిచడమే కాకుండా న్యాయం కావాలంటున్నార‌ని మండిప‌డ్డారు. నిరసనలో భాగంగా దళితులు రోడ్డుపై నడిచారని పసుపు నీళ్లతో శుద్ధి చేశారని ఆరోపించారు. పసుపు నీటితో శుద్ధి చేసి అవమానిచడమే కాకుండా న్యాయం కావాలంటున్నారని మండిపడ్డారు. బలహీనవర్గాలు, దళిత, గిరిజనులకు న్యాయం కావాల్సిందన్నారు. విపక్ష నేతల ఆగడాలు, అవమానాలను ప్రభుత్వం సంయమనంతో భరిస్తున్న‌దని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కానీ, ప్ర‌భుత్వం కానీ, త‌మ ఎమ్మెల్యేలు కేసీఆర్ చావునుకోరుకోవ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

కేసీఆర్‌ బాగుండాలి, వంద ఏళ్లకు పైగా బతికుండాలనే కోరుకుంటున్నాం : మంత్రి శ్రీధర్‌బాబు

బీఆర్‌ఎస్‌ ప్రస్తావించాల్సిన అంశాలను స్పీకర్‌కు సరైన రూపంలో ఇవ్వాలని మంత్రి శ్రీధర్​బాబు స్పష్టం చేశారు. అసభ్య పదజాలానికి సంబంధించి సభలో ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్‌ బాగుండాలి, వంద ఏళ్లకు పైగా బతికుండాలనే కోరుకుంటున్నామన్నారు. తెలంగాణకు కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో సేవ చేయాలని కోరుకుంటామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎవరి చావు కోరుకోదని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement