Stock Markets | పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రతరం కావడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల దిశగా దూసుకెళ్లింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్‌పై పెరుగుతున్న చమురు ధరలు తీవ్ర ప్రభావం చూపుతాయన్న ఆందోళనలు మార్కెట్‌లపై ఒత్తిడిని పెంచాయి.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రతరం కావడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల దిశగా దూసుకెళ్లింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్‌పై పెరుగుతున్న చమురు ధరలు తీవ్ర ప్రభావం చూపుతాయన్న ఆందోళనలు మార్కెట్‌లపై ఒత్తిడిని పెంచాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 510.89 పాయింట్లు (0.7 శాతం) నష్టపోయి 75,066.69 వద్ద ట్రేడయింది. మరోవైపు నిఫ్టీ 50 సూచీ 120.85 పాయింట్లు (0.5 శాతం) క్షీణించి 23,514.25 వద్ద కొనసాగింది. మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాల్లో ముడి చమురు ధరల పెరుగుదల ఒకటి. బ్రెంట్ క్రూడ్ 1.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 99.5 డాలర్లకు చేరింది. చమురు ధరలు అధికంగా కొనసాగితే భారత్ వాణిజ్య లోటు మరింత విస్తరించే అవకాశం ఉంది. అదే సమయంలో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరగడంతోపాటు ఆర్థిక వృద్ధిపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తీవ్రమైన యుద్ధం..
పశ్చిమాసియా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదరడం కూడా మార్కెట్లను దెబ్బతీసింది. ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న యెమెన్‌కు చెందిన హౌతీలు సౌదీ అరేబియాలోని పలు నగరాలపై దాడులు చేపట్టారు. దీంతో అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియా కూడా యుద్ధ పరిస్థితుల్లో మరింతగా చిక్కుకునే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అమెరికా దళాలు పలు ఇరాన్ చమురు ట్యాంకర్లపై దాడులు చేయగా, ఇరాన్ జోర్డాన్‌లోని అమెరికా స్థావరంపై దాడి చేసింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళనలను పెంచాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల అమ్మకాలు కూడా దేశీయ మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. గత సెషన్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత ఈక్విటీల్లో నికర విక్రయదారులుగా మారి రూ.123 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
కీలక స్థాయిల్లో ఉన్నప్పటికీ..
మార్కెట్ల సాంకేతిక పరిస్థితిపై జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ మాట్లాడుతూ జూలై కనిష్ఠ స్థాయికి సమీపంలో మార్కెట్ ఉండటం వల్ల బుల్స్ మళ్లీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ, గత సెషన్‌లో మార్కెట్ దిగువ బోలింజర్ బ్యాండ్ కంటే దిగువన ముగియడం వల్ల మరింత పతనం పూర్తిగా ముగిసిందని చెప్పలేమన్నారు. ప్రస్తుతం 23,500-23,260-23,000 స్థాయిలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు 23,500 స్థాయి వద్ద మార్కెట్ స్థిరపడటం లేదా త్వరగా 23,650 పైన నిలదొక్కుకోవడం జరిగితే షార్ట్ కవరింగ్‌కు అవకాశం ఏర్పడి 23,860-23,900 స్థాయిల వరకు రికవరీకి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●BRS MLAs | సమావేశాలు ముగిసే వరకు.. శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
- ●Assembly Session | దళితులు ఆందోళన చేస్తే శుద్ధి చేస్తారా? .. మంత్రి అడ్లూరి ఆగ్రహం..
- ●BRS | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాష్టీకం, రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలు.. బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు
- ●Bank of America | అమెరికా నుంచి భారత్‌కు యూపీఐతో చెల్లింపులు.. బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక అడుగు..
- ●Gurukula School | మార్నింగ్ వాక్కు వెళ్లి.. కుప్పకూలిన గురుకుల విద్యార్థి.. దవాఖానకు తరలించే లోపే..
- ●Seed Ganesha | పర్యావరణ హిత వినాయకోత్సవం.. సీడ్ గణేశుడిని స్వీకరించిన పూజా హెగ్డే, సంపత్ నంది

BRS MLAs | సమావేశాలు ముగిసే వరకు.. శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Assembly Session | దళితులు ఆందోళన చేస్తే శుద్ధి చేస్తారా? .. మంత్రి అడ్లూరి ఆగ్రహం..

BRS | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాష్టీకం, రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలు.. బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు

Bank of America | అమెరికా నుంచి భారత్‌కు యూపీఐతో చెల్లింపులు.. బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక అడుగు..






