త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS | మహిళా పోలీసులపై దురుసు ప్రవర్తన.. బీఆర్ ఎమ్మెల్యేల‌పై మ‌రో కేసు

BRS | అసెంబ్లీ స‌మావేశాల (Assembly Session) తొలిరోజు చోటుచేసుకున్న ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ నాయ‌కుల‌పై మ‌రో కేసు న‌మోద‌యింది. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR)​, ఆ పార్టీ ఎల్పీ ఉప‌నేత‌ హరీశ్​ రావు (Harish Rao) సహా పలువురు బీఆర్ఎస్ నాయకులపై సైఫాబాద్ పోలీస్​స్టేషన్​లో కేసు ఫైల్ అయింది.

G

Telangana | Published On Sep 9, 2026, 11.23 am IST

BRS | మహిళా పోలీసులపై దురుసు ప్రవర్తన.. బీఆర్ ఎమ్మెల్యేల‌పై మ‌రో కేసు
Advertisement

BRS | త్రినేత్ర‌.న్యూస్‌: అసెంబ్లీ స‌మావేశాల (Assembly Session) తొలిరోజు చోటుచేసుకున్న ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ నాయ‌కుల‌పై మ‌రో కేసు న‌మోద‌యింది. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR)​, ఆ పార్టీ ఎల్పీ ఉప‌నేత‌ హరీశ్​ రావు (Harish Rao), ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నాయకులపై సైఫాబాద్ పోలీస్​స్టేషన్​లో కేసు ఫైల్ అయింది. అసెంబ్లీ గేట్‌ నంబర్ 03 వద్ద జరిగిన ఘటనపై మహిళా కానిస్టేబుల్ (Women Corps) పద్మావతి ఫిర్యాదుతో బీఎన్ఎస్‌ 74, 75(1), 79, 121(1), 130, 132, 296, 351(2), 352 r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించ‌డంతోపాటు దుర్భాషలాడి, బెదిరించారని, మ‌హిళా పోలీసుల‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మహిళా పోలీసులని చూడకుండా తమ ఎదుట టీషర్టులు విప్పి అర్ధనగ్నంగా నిలబడ్డారని, విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని తెలిపారు. మ‌రోవైపు సోమ‌వారం నాటి ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటోల‌ను ప్ర‌భుత్వం ఇప్ప‌టికే విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

అసెంబ్లీ స‌మావేశాల తొలిరోజు చోటుచేసుకు తీవ్ర ఉద్రిక్త‌త‌లు, ఫ‌ర్ష‌ణ‌ల ఘ‌ట‌న‌ల‌పై పోలీసులు కేసులు న‌మోదుచేశారు. కేటీఆర్‌, హ‌రీశ్ రావు, ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితోపాటు (Sudheer Reddy) ప‌లువురు ఎమ్మెల్యేపై కేసు ఫైల్ చేశారు. విధుల్లో ఉన్న పోలీసుల‌పై దాడుల‌కు పాల్ప‌డ‌టం, విధుల‌కు ఆటంకం క‌లిగించ‌డం, అస‌భ్య ప‌ద‌జాలంతో దుర్భాష‌లాడార‌న్న (Abusive Language) ఆరోప‌ణ‌ల‌పై సైఫాబాద్ పోలీస్ స్టేష‌న్‌లో కేసులు న‌మోదుచేశారు. అసెంబ్లీ ప్రాంగ‌ణం, రోడ్ల‌పై జ‌రిగిన తోపులాట దృశ్యాలు, మీడియా కెమెరాలు, పోలీసుల బాడీ వార్న్ కెమెరాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు న‌మోదుచేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

 

Advertisement
Advertisement