Arvind Kejriwal | నా ఖాతాను ఎందుకు నిలిపివేశారు..? మెటాపై కేజ్రీవాల్ ఆగ్రహం
Arvind Kejriwal | ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా (Meta)పై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP national convenor) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో తన అకౌంట్‌పై ఎందుకు ఆంక్షలు విధించారంటూ ప్రశ్నించారు.
Arvind Kejriwal | త్రినేత్ర.న్యూస్ : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా (Meta)పై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP national convenor) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో తన సోషల్ మీడియా ఖాతాపై మెటా ఆంక్షలు విధించిందని ఆరోపించారు. దీనిపై మెటా ఇండియా కార్యాలయాన్ని సంప్రదించినా ఫలితం లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేజ్రీ పోస్టు పెట్టారు.
మెటా ఇండియా కార్యాలయంలో ఆరా తీయగా తన అకౌంట్‌ను పరిమితం చేసినట్లు తెలిసిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం అది భారత్‌లో అందుబాటులో లేదన్నారు. తన అకౌంట్ నియంత్రణపై మెటా అధికారులను ప్రశ్నిస్తే సరిగా సమాధానం ఇవ్వడం లేదని, ఈమెయిల్ పంపినా కూడా స్పందించడం లేదని మండిపడ్డారు. ఆంక్షలు ఎలా తొలగుతాయో ఎవరూ చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా చెత్త సేవ అంటూ అసహనం వ్యక్తం చేశారు. తన అకౌంట్‌పై ఎందుకు ఆంక్షలు విధించారంటూ మెటాను కేజ్రీ ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని మోటా సంస్థకు కేజ్రీవాల్ సూచించారు. ఇండియాలో కేవలం ఆయన ఒక్క అకౌంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తారని విమర్శించారు. సంస్థ తన సేవలను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. అయితే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఏ ఖాతాలపై ఈ ఆంక్షలు విధించారనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఈ ట్వీట్‌కు మెటా ఇండియాని ట్యాగ్ చేశారు. కాగా, ప్రధాని మోదీ వీడియో తొలగింపు అంశంలో మెటా సంస్థ ప్రభుత్వం నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ అంశంలో సంస్థ ఈసీవో మార్క్ జుకర్ బర్గ్ ప్రధాని మోదీకి బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. ఈ వివాదం వేళ కేజ్రీవాల్ ఖాతాపై ఆంక్షలు విధించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
Hi @Meta @metaindia
Why have you restricted my account? Verbal enquiries at your India office revealed that my account has been restricted in India and is unavailable in India. Why? Noone in your office is giving any reasons. Noone is suggesting how restrictions can be removed.… pic.twitter.com/4JThAqFMon
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 6, 2026
Also Read..
అత్యాచారం కేసు.. తహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చిన కోర్టు
సైన్యంలో చేరిన డెన్మార్క్ యువరాణి ఇసాబెల్లా.. సరికొత్త రికార్డు
సంబంధిత వార్తలు

CJP Abhijeet Dipke | ఒకటో తరగతికి లక్షన్నర ఫీజు అయితే.. డబ్బులు ఎక్కడ్నుంచి వస్తయ్..?
ఆగస్టు 6, 2026

Mallikarjun Kharge | విద్యార్థులపై పోలీసుల చర్య.. సభలో ప్రకటన చేయడానికి అమిత్‌షాకు ఏం అడ్డంకులు ఉన్నాయ్..?
ఆగస్టు 6, 2026

WhatsApp | వాట్సాప్ గ్రూప్ చాట్స్‌లో భారీ మార్పులు.. పోల్స్, ఎట్ ఆల్, కొత్త గ్రూప్ ఫీచర్లు అందుబాటులోకి..
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Vijay-Sangeeta | సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత
- ●EV Charging Station | ఈవీ చార్జింగ్ స్టేషన్లకు భారీగా డిమాండ్.. స్వయం ఉపాధితో చక్కని ఆదాయం..
- ●Komatireddy | కాంట్రాక్టర్లను వేధించొద్దు.. గనులశాఖ అధికారులకు కోమటిరెడ్డి ఆదేశాలు
- ●Harish Rao | ‘మిషన్ భగీరథ’ అనేది పథకం కాదు.. ప్రజల జీవితాలను మార్చిన మహత్తర ప్రణాళిక
- ●Avengers | ఒక్క సినిమా 830 కోట్ల రెమ్యూనరేషన్ - అవెంజర్స్ డూమ్స్డేతో ఐరన్ మ్యాన్ రికార్డ్
- ●KJQ Movie Review | K J Q ప్రేక్షకులను మెప్పించిందా..? అసలు కథేంటో తెలుసా..?

Vijay-Sangeeta | సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత

EV Charging Station | ఈవీ చార్జింగ్ స్టేషన్లకు భారీగా డిమాండ్.. స్వయం ఉపాధితో చక్కని ఆదాయం..

Komatireddy | కాంట్రాక్టర్లను వేధించొద్దు.. గనులశాఖ అధికారులకు కోమటిరెడ్డి ఆదేశాలు

Harish Rao | ‘మిషన్ భగీరథ’ అనేది పథకం కాదు.. ప్రజల జీవితాలను మార్చిన మహత్తర ప్రణాళిక



