Jagadeesh Reddy | మేధావినని జయశంకర్ సార్ ఎన్నడూ చెప్పుకోలే.. తెలంగాణల ఇద్దరే మేధావులున్నరని ఓ సన్నాసి అన్నడు
Jagadeesh Reddy | తాను మేధావినని జయశంకర్ సార్ ఎన్నడూ చెప్పుకోలేదని.. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు కొందరు సన్నాసులకు అర్థం కారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణల ఇద్దరే మేధావులున్నరని నిన్న ఓ సన్నాసి చెప్పిండని ఎద్దేవా చేశారు. తెలంగాణ మేధావుల సంఘం పెట్టాలని చెప్పిన నాయకులను జయశంకర్ సున్నితంగా తిరస్కరించారని గుర్తు చేశారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
త్రినేత్ర.న్యూస్: తాను మేధావినని జయశంకర్ సార్ ఎన్నడూ చెప్పుకోలేదని.. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు కొందరు సన్నాసులకు అర్థం కారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణల ఇద్దరే మేధావులున్నరని నిన్న ఓ సన్నాసి చెప్పిండని ఎద్దేవా చేశారు. తెలంగాణ మేధావుల సంఘం పెట్టాలని చెప్పిన నాయకులను జయశంకర్ సున్నితంగా తిరస్కరించారని గుర్తు చేశారు. గురువారం ఆయన జయంతిని పురస్కరించుకొని జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. సార్ సేవలను కొనియాడుతూ ఘన నివాళులర్పించారు.
నేనెట్ల పెడతనయా..
సార్ నుంచి ఇంకొక గొప్ప మాట విన్నా నేన్. ఆంధ్రాలో ఒగడు శాల్వ మీదేసుకొనొచ్చి తెలగాణ మేధావుల సంఘం అని ఒచ్చిండు. మీగ్డూడ గుర్తు. రాంగనే మనోళ్లు కొంతమందొచ్చి సార్.. మనం గూడ తెలంగాణ మేధావుల సంఘం పెట్టాలనొచ్చిండు. ఏం సంఘమూ అని జయశంకర్ సార్ అన్నడు.. అంటే తెలంగాణ మేధావుల సంఘం సర్ అన్నడు.. అంటే మరి వాళ్లేక్కడున్నరు అని అడిగిండు.. సార్ మీరు పెట్టాలె అని మళ్లన్నడు. నేనెట్ల పెడతనయా.. అది మేధావుల సంఘం అంటుర్రు.. మేధావులే పెట్టుకోవాలె. మరి నేనెట్ల వెడతా అని అన్నడు అని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు.
మేధావి అన్నోడు ఇప్పటివరకు ఈ ప్రపంచంల చెప్పుకోలే నేన్ మేధావినని. నిన్న ఒక సన్నాసి చెప్పిండుగా.. తెలంగాణల ఎవడెవడు మేధావో అని. ఈ సన్నాసులకు అట్లాంటి గొప్పోళ్లు అర్థం కారు.
జయశంకర్ ఎంతో గొప్పవాడు. కానీ ఎప్పుడూ తాను గొప్పవాడని ఊహించుకోలే. గొప్పగా అనుకోలేదు. తెలంగాణ జ్యోతిని ఆర్పకుండా ముందుండి నడిచిన వ్యక్తే ఎన్నడూ అలా అనుకోలేదు. కేసీఆర్ నాయకత్వంలో కలిసి కొట్లాడ్డానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన జయశంకర్ సార్‌ను తెలంగాణ ఉన్నంత కాలం మనందరం యాది వెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని జగదీశ్ రెడ్డి ఆకాంక్షించారు.
మొదటి అడుగు వేసిందే జయశంకర్ సార్..
తెలంగాణ చరిత్ర ఎంత ఉంటుందో జయశంకర్ సార్ చరిత్ర అంతే ఉంటుంది. నేను, కేసీఆర్, జయశంకర్ సార్ ఒకే రూమ్‌లో కలిసి ఉన్నాం. సమైక్యాంధ్రా నడుం విరగొట్టేందుకు మొదటి అడుగు వేసిందే జయ శంకర్ సార్. తెలంగాణ దోపిడీకి గురవుతుందని కేసీఆర్‌కు అనేక సార్లు సార్ వివరంగా చెప్పేవాడు. తెలంగాణకు ఆర్థికంగా నిలబడే శక్తి లేదని సమైక్య ఆంధ్రా పాలకులు శ్రీ కృష్ణ కమిటీతో చెప్పారు. శ్రీ కృష్ణ కమిటీ ముందు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై జయశంకర్ సార్ వివరంగా చెప్పాడు. తెలంగాణ ఆర్థిక వనరుల గురించి కేసీఆర్, జయశంకర్ సార్ గంటలు గంటకు చర్చించారు. సమైక్య ఆంధ్రా వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పన్నులు చెల్లించలేదు. తెలంగాణలో ఉండేవారిని ముక్కపిండి పన్నులు వసూల్ చేశారు. క్రీడా జ్యోతి లాంటి గొప్పవారు జయశంకర్ సార్. తనకు తాను ఎప్పుడు గొప్పగా ఊహించుకోలేదు అని మాజీ మంత్రి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
ఆగస్టు 6, 2026

Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
ఆగస్టు 6, 2026

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Vastu Tips | వంట గదిలో చీపురు పెట్టొచ్చా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?
- ●High Court | సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయండి.. హైదరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం
- ●Horoscope | ఆగస్టు 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలం!
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!
- ●Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
- ●GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

Vastu Tips | వంట గదిలో చీపురు పెట్టొచ్చా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?

High Court | సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయండి.. హైదరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం

Horoscope | ఆగస్టు 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలం!

India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!



