Mettu Sai Kumar | అరవింద్ లాంటి దగుల్బాజీ.. నిజామాబాద్ ఎంపీ కావడం దురదృష్టం: మెట్టు సాయి కుమార్
Mettu Sai Kumar | సీఎం రేవంత్ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను (Arvind Dharmapuri) తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ (Mettu Sai Kumar) హెచ్చరించారు. అరవింద్ లాంటి దగుల్బాజీ నేత నిజామాబాద్ ఎంపీ కావడం దురదృష్టకరం అని మండిపడ్డారు.
Mettu Sai Kumar | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను (Arvind Dharmapuri) తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ (Mettu Sai Kumar) హెచ్చరించారు. అరవింద్ లాంటి దగుల్బాజీ నేత నిజామాబాద్ ఎంపీ కావడం దురదృష్టకరం అని మండిపడ్డారు. హైదరాబాద్ వస్తే చీపుర్లు ఆయన వీపుమీద విరుగుతాయని, పొర్కలతో మహిళా నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్నా, నిజామాబాద్‌లో (Nizamabad) ఉన్న వచ్చి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ గురించి ఢిల్లీలో మాట్లాడితే ఏమీ కాదని అనుకుంటున్నాడని, అక్కడ కూడా ముఖ్యమంత్రికి అభిమానులు న్నారని చెప్పారు.
అరవింద్ అనే వాడు వార్డు సభ్యుడికి కూడా తక్కువని ఎద్దేవా చేశారు. అనుకోకుండా అడ్డ దారిలో ఎంపీ అయ్యాడని మండిపడ్డారు. 2009లో బ్రోకర్ దందా చేసి ఎంపీగా గెలిచిండని విమర్శించారు. ఆయనను చెప్పుతో కొడితే చెప్పే సిగ్గు పడుతుందని చెప్పారు. అతనిది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన స్థాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 27 లక్షల మంది నిరుపేద విద్యార్థులు కార్పోరేట్ విద్య అందించాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చూస్తున్నారని వెల్లడించారు. అరవింద్‌కు కళ్లు కనిపించకుండా పోయాయని, పక్షవాతం వచ్చిందని ధ్వజమెత్తారు. అందుకే సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తెలంగాణను (Telangana) దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్న రేవంత్ రెడ్డిని చూసి అడ్డగాడిదలు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు ఊరుకోరని, రేవంత్‌ని దూషించిన వారికి కుక్కకాటుకు చెప్పు దెబ్బ తప్పదని హెచ్చరించారు.
తాగుబోతు.. పనికిరాని ఎంపీ
ఎంపీ ధర్మపురి అరవింద్ బ్రోకర్ అని, తాగుబోతు, తిరుగుబోతు అంటూ సాయికుమార్ ఫైర్ అయ్యారు. తాను తిరుగుబోతునని, తాగుబోతు ఎంపీనని మర్చిపోతున్నాడని మండిపడ్డారు. అతడొక పనికిరాని ఎంపీ అని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో ధర్మపురి అరవింద్ లాంటి తాగుబోతు, తిరుగుబోతు లేడన్నారు. మధ్యాహ్నం 12 గంటలు కాగానే పబ్‌లోనే ఉంటాడని తెలిపారు. ఆయన కారులో ఎప్పుడూ వైన్ బాటిళ్లు, సోడా, రెండు గ్లాసులు ఉంటాయని చెప్పారు.
సంబంధిత వార్తలు

Harish Rao | ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైంది రేవంత్?: హరీశ్ రావు
ఆగస్టు 13, 2026

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
ఆగస్టు 12, 2026

TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..
- ●Harish Rao | ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమన్న హామీ ఏమైంది రేవంత్?: హరీశ్ రావు

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్

Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..

Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం



