త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stubble Burning | పంజాబ్‌లో పంట వ్య‌ర్థాల ద‌గ్ధం తీవ్ర‌రూపం.. 2,787 ఘ‌ట‌న‌లు, రూ.46.10 ల‌క్ష‌ల ఫైన్‌

Stubble Burning | పంజాబ్‌లో పంట వ్యర్థాల దగ్ధం (Stubble Burning) సమస్య తీవ్ర రూపం దాల్చింది (Punjab farm fire cases). ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,787 పంట వ్యర్థాలను కాల్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి. 914 కేసుల‌కు సంబంధించి మొత్తం రూ.46.10 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు.

D

National | Published On Nov 6, 2026, 4.17 pm IST

Stubble Burning | పంజాబ్‌లో పంట వ్య‌ర్థాల ద‌గ్ధం తీవ్ర‌రూపం.. 2,787 ఘ‌ట‌న‌లు, రూ.46.10 ల‌క్ష‌ల ఫైన్‌
Advertisement

Stubble Burning | త్రినేత్ర న్యూస్ : పంజాబ్‌లో పంట వ్యర్థాల దగ్ధం (Stubble Burning) సమస్య తీవ్ర రూపం దాల్చింది (Punjab farm fire cases). పంజాబ్ కాలుష్య నియంత్రణ మండలి (PPCB) నివేదిక ప్ర‌కారం.. ఈ సీజన్‌లో (సెప్టెంబ‌ర్ 15 నుంచి న‌వంబ‌ర్ 5 వ‌ర‌కూ) రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,787 పంట వ్యర్థాలను కాల్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో మొత్తం 2,194 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా.. అందులో 994 చోట్ల పంట వ్యర్థాలను కాల్చినట్లు నిర్ధారణ అయింది. 914 కేసుల‌కు సంబంధించి మొత్తం రూ.46.10 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు. ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.24.85 ల‌క్ష‌లు వ‌సూలు చేసిన‌ట్లు స‌ద‌రు నివేదిక వెల్ల‌డిస్తోంది.

అంతేకాదు, నిబంధనల ఉల్లంఘ‌ణ‌కు సంబంధించి 710 ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదు చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ ప్రయోజనాలకు ఇబ్బంది కలిగేలా 829 కేసులకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో 'రెడ్ ఎంట్రీలు' (red entries) పెట్టారు. జిల్లాల వారీగా చూస్తే త‌ర్న్‌ త‌ర‌ణ్ (Tarn Taran) జిల్లా 586 పంట వ్య‌ర్థాల ఘ‌ట‌న‌ల‌తో అగ్ర‌స్థానంలో నిలిచింది. ఇక్క‌డ 553 చోట్ల తనిఖీలు నిర్వహించగా, 294 చోట్ల పంట వ్యర్థాలను కాల్చినట్లు నిర్ధారణ అయింది. ఆ త‌ర్వాతి స్థానాల్లో ఫిరోజ్‌పూర్ (361), సంగ్రూర్ (240), అమృత్‌సర్ (221) , భటిండా (216) ఉన్నాయి. పాటియాలాలో 156 ఘటనలు నమోదయ్యాయి.

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకూ తీవ్రమవుతోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ – ఎన్సీఆర్‌ ప్రాంతంలో గాలి నాణ్యత చాలా పూర్ కేట‌గిరీలో నమోదవుతోంది. న‌గ‌రంలోని కొన్ని ఎయిర్ మానిట‌రింగ్ స్టేష‌న్ల‌లో ఏక్యూఐ లెవల్స్ 350కి పైనే న‌మోదవుతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో రైతులు తమ పంట వ్యర్థాలను తగలబెడుతుండటంతో (Stubble Burning) రాజధాని ప్రాంతంలో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఈ నేప‌థ్యంలోనే పంట వ్యర్థాలను తగులబెట్టకుండా నియంత్రించేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రైతులు లెక్కచేయడం లేదు. కొంతమంది రైతులు పంటకోత తర్వాత మిగిలిన గడ్డి తొలగింపునకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుండ‌గా.. చాలా మంది రైతులు తమ పొలాలలోనే పంట వ్యర్థాలను తగులబెడుతున్నారు.

Also Read..

రైల్లో అగ్నిప్ర‌మాదం.. నాలుగు కోచ్‌ల‌కు అంటుకున్న మంట‌లు

ఇది ఓట్ల చోరీ కాదు.. హక్కుల చోరీ.. ఓటర్ ఐడీతో సంక్షేమ పథకాల‌పై రాహుల్ విమ‌ర్శ‌లు

పిల్లల భవిష్యత్తు కోసం ‘నెస్ట్‌వెస్ట్’.. ఏడాదికి కేవలం రూ.29కే పెట్టుబడి సలహాలు..

Advertisement
Advertisement