త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Padi Kaushik Reddy | హోం మంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభినంద‌న‌లు

Padi Kaushik Reddy | క‌రీంన‌గ‌ర్ ఆర్టీసీ బ‌స్టాండ్ ఇన్‌గేట్ స‌మీపంలో ఓ యువ‌కుడు దారుణ హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డి కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

S

Telangana | Published On Nov 6, 2026, 3.22 pm IST

Padi Kaushik Reddy | హోం మంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభినంద‌న‌లు
Advertisement

Padi Kaushik Reddy |  త్రినేత్ర న్యూస్ : క‌రీంన‌గ‌ర్ ఆర్టీసీ బ‌స్టాండ్ ఇన్‌గేట్ స‌మీపంలో ఓ యువ‌కుడు దారుణ హ‌త్య‌కు గురైన ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో శాంతి భ‌ద్ర‌త‌లు ఎంత ఆందోళ‌న‌కరంగా ఉన్నాయో ఈ ఘ‌ట‌న‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ఈ ఘ‌ట‌న‌తో రాష్ట్ర హోం మంత్రి రేవంత్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్ పోలీసు క‌మిష‌న‌ర్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాన‌ని ఎక్స్ వేదిక‌గా కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

హుజురాబాద్‌లో హ‌త్య ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. మ‌ళ్లీ 39 రోజుల‌కే క‌రీంన‌గ‌ర్‌లో మ‌రో హ‌త్య జ‌ర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. ప్ర‌జా భ‌ద్ర‌త కోసం క‌రీంన‌గ‌ర్ పోలీసు క‌మిష‌న‌ర్ ఏం చేస్తున్నారు..? అధికార యంత్రాంగం మేల్కొనేలోపు ఇంకెంత మంది అమాయ‌క ప్రాణాలు బ‌లి కావాల‌ని ప్ర‌శ్నించారు.

బీఆర్ఎస్ నేత‌ల‌పై దృష్టి సారించి, వారిపై చ‌ట్ట‌విరుద్ధంగా కేసులు పెట్ట‌డం మానేసి, పోలీసులు శాంతిభ‌ద్ర‌త‌లు, నేర నివార‌ణ‌, సామాన్యుల భ‌ద్ర‌త‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి క‌దా..? అని అడిగారు. నేరాల‌ను నివారించి, ప్ర‌జ‌లు నిర్భ‌యంగా జీవించేలా చూడ‌డం పోలీసులు ప్రాథ‌మిక బాధ్య‌త అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఇక చాలు.. క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డంపై దృష్టి సారించండి అని సూచించారు. కరీంనగర్‌కు ఇంతకంటే మంచి భవిష్యత్తు కావాలి. దయచేసి మా ప్రజలను కాపాడండి! అని కౌశిక్ రెడ్డి వేడుకున్నారు.

Advertisement
Advertisement