Bengaluru Metro | నిలిచిన మెట్రో రైళ్లు.. లారీలు, ట్రక్కులు ఎక్కిన టెకీలు
Bengaluru Metro | నిత్యం లక్షలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే బెంగళూరు మెట్రో (Bengaluru Metro) సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. పీక్ అవర్స్‌లో ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమైన వేలాది మంది టెకీలు స్టేషన్లలోనే చిక్కుకుపోయారు. లారీలు, ట్రక్కులు ఎక్కి గమ్యస్థానాలకు చేరుకున్నారు.
Bengaluru Metro | నిత్యం లక్షలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే బెంగళూరు మెట్రో (Bengaluru Metro) సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. మంగళవారం సాయంత్రం పీక్ అవర్స్‌లో ‘నమ్మ మెట్రో’ పర్పుల్ లైన్‌లో (Purple Line) సాంకేతిక లోపం తలెత్తడంతో రైళ్లు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. దీంతో పని ముగించుకుని ఇంటిబాట పట్టిన వేలాది మంది నగరవాసులు తీవ్ర అవస్థలు పడ్డారు.
సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ (Cubbon Park Metro Station) వద్ద ఒక రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. వైట్‌ఫీల్డ్ ఐటీ కారిడార్‌ను నగరంలోని కీలక ప్రాంతాలతో అనుసంధానించే ఈ పర్సుల్ లైన్ నిలిచి పోవడంతో.. పీక్ అవర్స్‌లో ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమైన వేలాది మంది టెకీలు స్టేషన్లలోనే చిక్కుకుపోయారు. రైళ్లు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలో వారంతా ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో గందరగోళం చోటు చేసుకుంది. బస్సులు కిక్కిరిసి ఉండటంతో చాలా మంది క్యాబ్‌లు బుక్ చేసుకుని వెళ్లారు. మరికొందరు లారీలు, ట్రక్కులు ఎక్కి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానిక ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
It is unfortunate that disruptions in Namma Metro are slowly becoming a "new normal" in Bengaluru.
A city celebrated as India's Silicon Valley should not be struggling to keep its most important public transport system running smoothly. Today's technical glitch caused immense… pic.twitter.com/R6kBA2GHA8
— Dr. Ravi C. T 🇮🇳 ಡಾ. ರವಿ ಸಿ. ಟಿ (@CTRavi_BJP) June 24, 2026
India's Silicon Valley or India's Biggest Infrastructure Failure? IT Employees Forced to Hitch Rides on Trucks After Yet Another Metro Breakdown
Bengaluru proudly calls itself India's Silicon Valley, a global technology hub that powers innovation, startups, and multinational… pic.twitter.com/qAGDEQfyNj
— Karnataka Portfolio (@karnatakaportf) June 24, 2026
Bengalureans hop on to a lorry after metro train serves were disrupted last night due to technical glitches. Hundreds were stranded at inside metro stations and streets. The technical issue has been fixed at 5 am today. pic.twitter.com/WU2AIQaqfO
— Deepak Bopanna (@dpkBopanna) June 24, 2026
Also Read..
భోజ్‌పూర్‌లో యువకుడి ఎన్‌కౌంటర్‌పై విమర్శలు.. పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు
ఇరాన్‌కు ప్రయాణాలు చేయొద్దు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచన
రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు అక్రమాల వల్లే రైతుల ఆత్మహత్య : గువ్వల బాలరాజు
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 791 పాయింట్లు జంప్, భారీగా కొనుగోళ్లు..
- ●Balka Suman | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్
- ●HyPrevent | దాగి ఉన్న హైబీపీని గుర్తించడమే కాదు, ఏఐ ఇక గుండె జబ్బులనూ ముందే చెప్పేస్తుంది.. ఆక్స్ఫర్డ్ పరిశోధకుల సంచలనం..
- ●Joginipally Santosh Kumar | సంతోష్ కుమార్‌కు కెన్యా గ్రీన్ అంబాసిడర్‌గా ఆహ్వానం.. బ్రిటన్ పార్లమెంట్లో మార్మోగిన గ్రీన్ ఇండియా చాలెంజ్
- ●MLC Dasoju Sravan | 'ఒక వ్యక్తి - ఒక ఓటు' సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందే : ఎమ్మెల్సీ దాసోజు
- ●Mahesh Babu | ‘వారణాసి’ షూట్‌కు బ్రేక్.. ఫ్యామిలీతో వెకేషన్‌కు మహేశ్

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 791 పాయింట్లు జంప్, భారీగా కొనుగోళ్లు..

Balka Suman | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్

HyPrevent | దాగి ఉన్న హైబీపీని గుర్తించడమే కాదు, ఏఐ ఇక గుండె జబ్బులనూ ముందే చెప్పేస్తుంది.. ఆక్స్ఫర్డ్ పరిశోధకుల సంచలనం..

Joginipally Santosh Kumar | సంతోష్ కుమార్‌కు కెన్యా గ్రీన్ అంబాసిడర్‌గా ఆహ్వానం.. బ్రిటన్ పార్లమెంట్లో మార్మోగిన గ్రీన్ ఇండియా చాలెంజ్






