MLC Dasoju Sravan | ‘ఒక వ్యక్తి – ఒక ఓటు’ సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందే : ఎమ్మెల్సీ దాసోజు
MLC Dasoju Sravan | ఒక వ్యక్తి – ఒక ఓటు సూత్రాన్ని కచ్చితంగా అమలు చేసి, ద్వంద్వ ఓటరు నమోదులను గుర్తించి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నేతృత్వంలోని బృందం కోరింది.
MLC Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : ఒక వ్యక్తి – ఒక ఓటు సూత్రాన్ని కచ్చితంగా అమలు చేసి, ద్వంద్వ ఓటరు నమోదులను గుర్తించి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నేతృత్వంలోని బృందం కోరింది. బీఆర్‌కే భవన్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని దాసోజు శ్రవణ్, కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, కురువ విజయ్ కలిసి ప్రత్యేక సవివర ఓటు జాబితా సవరణ(SIR)పై వినతిపత్రం సమర్పించారు.
అనంతరం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సీఈవోను కలిసి సర్‌పై వినతిపత్రం సమర్పించడం జరిగింది. ప్రజాస్వామ్య పునాదులను విధ్వంసం చేసేటటువంటిది.. రాజ్యాంగ స్ఫూర్తిని సర్వనాశనం చేసేటటువంటిది. పవిత్రమైన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా భ్రష్టు పట్టించే ప్రక్రియ డూప్లికేట్ ఓటర్లు.. బోగస్ ఓటర్లు. ఈ బోగస్, డూప్లికేట్ ఓటర్ల వల్ల పవిత్రమైన ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను సర్వనాశనం చేస్తున్నారు. భ్రష్టు పట్టిస్తున్నారు. దీన్ని సరిదిద్దుకునేందుకు సర్ అనే ప్రక్రియను తీసుకొచ్చామని చెబుతున్నారు. కానీ బోగస్, డూప్లికేట్ ఓటర్లను తొలగించే మెకానిజం మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద లేదు. ఇది పూర్తిగా ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించేదే అని ధ్వజమెత్తారు.
అయితే హైదరాబాద్ ఇవాళ ఒక గ్లోబల్ సిటీగా మారిపోయింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వారున్నారు. 20 ఏండ్లుగా ఉంటుండడంతో.. సహజంగానే వారికి కూడా ఇక్కడ ఓటు హక్కు ఉంటుంది. వారి సొంత రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు ఉంటుంది. మరి రెండు రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు ఉన్నట్టే కదా..? ఆ ఓటర్లను ఏరివేస్తాం అని చెబుతున్నారు. ఎలా గుర్తిస్తారు అని అడిగితే మా దగ్గర మెకానిజం లేదని కేంద్రం ఎన్నికల సంఘం అంటుంది. విభజన చట్టాన్ని కూడా పట్టించుకోవడం లేదు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పని చేస్తే బోగస్ ఓట్లను తొలగించే అవకాశం ఉందని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Janhvi Kapoor | పెద్ది సక్సెట్ మీట్లో కనిపించని జాన్వీ.. ఇంతకు దూరం పెట్టారా? ఉంటోందా?
- ●Kamakhya Ambubachi Mela 2026 | యోని ఆకారంలో అమ్మవారు.. కామాఖ్య గుడిలో 'అంబుబాచి మేళా' షురూ.. భక్తులకు కొత్త రూల్స్ ఇవే!
- ●Knack Packaging IPO | న్యాక్ ప్యాకేజింగ్ సంస్థ ఐపీవోకు సిద్ధం.. రూ.440 కోట్ల ఇష్యూ.. ఎప్పుడంటే..
- ●Rajinikanth | నేను మాట్లాడినా తప్పే.. మాట్లాడకపోయినా తప్పే : రజనీకాంత్
- ●Ponnam Prabhakar | యూరియా సరఫరా కేంద్రం బాధ్యతనే.. లేదంటే బరాబర్ కొట్లాడుతాం : మంత్రి పొన్నం
- ●Sony BRAVIA Theatre | సోనీ నుంచి బ్రావియా థియేటర్ సిరీస్ సౌండ్ సిస్టమ్లు.. అద్భుతమైన క్వాలిటీ, ధర తక్కువ..

Janhvi Kapoor | పెద్ది సక్సెట్ మీట్లో కనిపించని జాన్వీ.. ఇంతకు దూరం పెట్టారా? ఉంటోందా?

Kamakhya Ambubachi Mela 2026 | యోని ఆకారంలో అమ్మవారు.. కామాఖ్య గుడిలో 'అంబుబాచి మేళా' షురూ.. భక్తులకు కొత్త రూల్స్ ఇవే!

Knack Packaging IPO | న్యాక్ ప్యాకేజింగ్ సంస్థ ఐపీవోకు సిద్ధం.. రూ.440 కోట్ల ఇష్యూ.. ఎప్పుడంటే..

Rajinikanth | నేను మాట్లాడినా తప్పే.. మాట్లాడకపోయినా తప్పే : రజనీకాంత్





