త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mobile snatching | విషాదంగా ముగిసిన దొంగ‌త‌నం.. ఫోన్ కొట్టేసి పారిపోతుండ‌గా గుండెపోటు..

Mobile snatching | ఓ వ్య‌క్తి న‌డుకుంటూ వెళ్తున్నాడు. ఇంత‌లో బైక్‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు వ‌చ్చారు. అత‌ని చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కొని (Mobile snatching) వెళ్లిపోయారు. పారిపోయే క్ర‌మంలో అదుపుత‌ప్పి కింద ప‌డిపోయారు.

G

National | Published On Jun 20, 2026, 8.06 am IST

Mobile snatching | విషాదంగా ముగిసిన దొంగ‌త‌నం.. ఫోన్ కొట్టేసి పారిపోతుండ‌గా గుండెపోటు..
Advertisement

Mobile snatching | త్రినేత్ర‌.న్యూస్‌: ఓ వ్య‌క్తి న‌డుకుంటూ వెళ్తున్నాడు. ఇంత‌లో బైక్‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు వ‌చ్చారు. అత‌ని చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కొని (Mobile snatching) వెళ్లిపోయారు. పారిపోయే క్ర‌మంలో అదుపుత‌ప్పి కింద ప‌డిపోయారు. దీంతో కాళ్ల‌కు ప‌నిచెప్పిన ఓ దుండ‌గుడు కొద్ది దూరం ప‌రుగెత్తాడు. ఇంత‌లోనే అనుకోకుండా ఫుట్‌పాత్‌పై కుప్ప‌కూలాడు. దొంగ‌త‌నం కాస్తా ఊహించ‌ని విషాదంగా ముగిసిన ఘ‌ట‌న బెంగ‌ళూరులో (Bengaluru) చోటుచేసుకున్న‌ది.

బెంగ‌ళూరులోని క‌బ్బ‌న్‌పేటలో 14వ క్రాస్ వ‌ద్ద ఓ న్యాయ‌వాది న‌డుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంత‌లో ద్విచ‌క్ర వాహ‌నంపై వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తులు అత‌ని పోన్ లాక్కొని వెళ్లారు. దీంతో అత‌డు కేక‌లు వేయ‌డంతో అదే స‌మ‌యంలో అటువైపు వ‌స్తున్న ఓ కార్మికుడు త‌న త‌ల‌పై ఉన్న బ‌స్తాను వారిపైకి విసిరేశాడు. ఈ క్ర‌మంలో బైక్ అదుపుత‌ప్పి కింద‌ప‌డిపోయింది. దీంతో దొరికిపోతామ‌ని అనుకున్న దొంగ‌లు.. బైక్‌ను, ఫోన్‌ను అక్క‌డే వ‌దిలేసి కాళ్ల‌కు ప‌నిచెప్పారు. ఈ క్ర‌మంలో జునైద్ (18) అనే నిందితుడు ఫుట్‌పాత్‌పై ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. రెండో నిందితుడు అర్బాజ్ (23)ను అదుపులోకి తీసుకున్నారు. జునైద్‌కు గ‌తంలోనే గుండె జ‌బ్బు ఉంద‌ని, పారిపోయే క్ర‌మంలో తీవ్ర ఒత్తిడి వ‌ల్ల అత‌నికి కార్డియాక్ అరెస్ట్ అయి ఉండొచ్చ‌ని పోలీసులు తెలిపారు. ఇదంతా అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల‌లో రికార్డ‌యింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement