Yoga | యోగా వేడుకల్లో 4 వేల మందికిపైగా ఖైదీలు..
Yoga | 12వ అంతర్జాతీయ యోగా (International Yoga Day) వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పశ్చిమబెంగాల్‌లోని జల్దపార నేషనల్ పార్కులో అటవీ సిబ్బందితో కలిసి యోగాలో (Yoga) ఏనుగులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Yoga | త్రినేత్ర.న్యూస్: 12వ అంతర్జాతీయ యోగా (International Yoga Day) వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పశ్చిమబెంగాల్‌లోని జల్దపార నేషనల్ పార్కులో అటవీ సిబ్బందితో కలిసి యోగాలో (Yoga) ఏనుగులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మావటీల ఆదేశాలకు అనుగుణంగా తొండం, చెవులు ఊపుతూ ఆసనాలు (Yoga Session) వేసి అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు (Parappana Agrahara) కూడా వార్తల్లో నిలిచింది. సామూహిక యోగా వేడుకల్లో భాగంగా 4000 మందికిపైగా ఖైదీలు (Inmates) పాల్గొన్నారు. విరితోపాటు జైలు అధికారులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు కూడా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ జీడీ అలోక్ కుమార్ యోగా ప్రాముఖ్యత గురించి ఖైదీలకు వివరించారు. శారీరక ఆరోగ్యం, మానసిక బలం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఖైదీలకు 1500 యోగా కిట్లను యూకో బ్యాంక్ అందించించగా, భారత జైళ్ల మంత్రిత్వ శాఖ మహిళా ఖైదీలకు 120 యోగా మ్యాట్‌లను పంపిణీ చేసింది. కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కోల్‌కతాలో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. యోగా అనేది ప్రపంచ ఉద్యమమని, అది దేశాలు, సాంస్కృతిక సరిహద్దులను అధిగమిస్తుందని చెప్పారు. కేవలం ఒక్కరోజుకో, ఒక్క కార్యక్రమానికో పరిమితం చేయకుండా యోగాభ్యాసాన్ని రోజువారీ జీవనంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. జూన్ 21 అంటే సుదీర్ఘ పగలు ఉండే రోజుగానే కాకుండా అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని, దానికి యోగా కారణమని తెలిపారు. ప్రతి ఏడాది జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకొంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్ `ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా`. ఇది అన్ని వయసుల వారు చురుకుగా, స్వతంత్రంగా మరియు నిమగ్నమై ఉండటానికి యోగా పోషించే పాత్రను సూచిస్తుంది.
తాజావార్తలు
- ●Heavy Rains | నేటి నుంచి 6 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
- ●Shiv Sena UBT | మధ్యాహ్నం 3 గంటలకు ఏక్నాథ్ శిండే వర్గంలో చేరనున్న శివసేన యూబీటీ ఎంపీలు..
- ●Horoscope | జూన్ 22 రాశి ఫలాలు.. ఈ రాశివారు విందు వినోదాలలో పాల్గొంటారు!
- ●Figure AI | మనుషుల కంటే రోబోలే ఎక్కువ.. ఆ ఏఐ కంపెనీలో సంచలనం! భయపెడుతున్న సీఈవో కామెంట్స్
- ●Saurabh Bothra | ఐఐటీ జాబ్ వద్దనుకుని 'యోగా' గురువయ్యాడు.. 169 దేశాల్లో 1.5 కోట్ల మందికి 'యోగా' నేర్పుతున్న యువకుడు!
- ●Mehdipatnam Hit and Run | మెహదీపట్నంలో 'హిట్ అండ్ రన్'.. డ్యూటీకి వెళ్తున్న నర్సును బలిగొన్న కారు.. VIDEO

Heavy Rains | నేటి నుంచి 6 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Shiv Sena UBT | మధ్యాహ్నం 3 గంటలకు ఏక్నాథ్ శిండే వర్గంలో చేరనున్న శివసేన యూబీటీ ఎంపీలు..

Horoscope | జూన్ 22 రాశి ఫలాలు.. ఈ రాశివారు విందు వినోదాలలో పాల్గొంటారు!

Figure AI | మనుషుల కంటే రోబోలే ఎక్కువ.. ఆ ఏఐ కంపెనీలో సంచలనం! భయపెడుతున్న సీఈవో కామెంట్స్






