Mahesh Babu | ‘వారణాసి’ షూట్‌కు బ్రేక్.. ఫ్యామిలీతో వెకేషన్‌కు మహేశ్
Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌లో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే. వరుస షెడ్యూళ్లతో బిజీగా గడుపుతున్న ఆయన, తాజాగా షూటింగ్‌కు స్వల్ప విరామం ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు.
Entertainment | Published On Jun 24, 2026, 3.34 pm IST
Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌లో నిమగ్నమై ఉన్న సంగతి తెలిసిందే. వరుస షెడ్యూళ్లతో బిజీగా గడుపుతున్న ఆయన, తాజాగా షూటింగ్‌కు స్వల్ప విరామం ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి మహేష్ బాబు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ‘వారణాసి’ చిత్రీకరణ నుంచి ఆయన కొద్దిరోజులు విరామం తీసుకున్నట్లు స్పష్టమైంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. జూలై తొలి వారంలో మహేశ్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇక ఈ చిత్రంలో యాక్షన్ ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది.
రాజమౌళి మార్క్ విజువల్ ట్రీట్‌తో పాటు భారీ స్థాయిలో రూపొందుతున్న పోరాట సన్నివేశాలు అభిమానులను అలరించనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక కథానాయికగా నటిస్తుండగా, ‘మందాకిని’ పాత్రలో కనిపించనుంది. మహేశ్ బాబు ‘రుద్ర’ పాత్రతో పాటు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయకపోయినా, ద్విపాత్రాభినయం అంశం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రాన్ని రూ.1300 కోట్లకుపైగా వ్యయంతో నిర్మిస్తున్నట్లు టాక్. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణతో పాటు ఎస్ఎస్ కార్తికేయ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చగా, సంభాషణలను దేవా కట్టా రచిస్తున్నారు. పూర్తిగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Janhvi Kapoor | పెద్ది సక్సెట్ మీట్లో కనిపించని జాన్వీ.. ఇంతకు దూరం పెట్టారా? ఉంటోందా?
- ●Kamakhya Ambubachi Mela 2026 | యోని ఆకారంలో అమ్మవారు.. కామాఖ్య గుడిలో 'అంబుబాచి మేళా' షురూ.. భక్తులకు కొత్త రూల్స్ ఇవే!
- ●Knack Packaging IPO | న్యాక్ ప్యాకేజింగ్ సంస్థ ఐపీవోకు సిద్ధం.. రూ.440 కోట్ల ఇష్యూ.. ఎప్పుడంటే..
- ●Rajinikanth | నేను మాట్లాడినా తప్పే.. మాట్లాడకపోయినా తప్పే : రజనీకాంత్
- ●Ponnam Prabhakar | యూరియా సరఫరా కేంద్రం బాధ్యతనే.. లేదంటే బరాబర్ కొట్లాడుతాం : మంత్రి పొన్నం
- ●Sony BRAVIA Theatre | సోనీ నుంచి బ్రావియా థియేటర్ సిరీస్ సౌండ్ సిస్టమ్‌లు.. అద్భుతమైన క్వాలిటీ, ధర తక్కువ..

Janhvi Kapoor | పెద్ది సక్సెట్ మీట్లో కనిపించని జాన్వీ.. ఇంతకు దూరం పెట్టారా? ఉంటోందా?

Kamakhya Ambubachi Mela 2026 | యోని ఆకారంలో అమ్మవారు.. కామాఖ్య గుడిలో 'అంబుబాచి మేళా' షురూ.. భక్తులకు కొత్త రూల్స్ ఇవే!

Knack Packaging IPO | న్యాక్ ప్యాకేజింగ్ సంస్థ ఐపీవోకు సిద్ధం.. రూ.440 కోట్ల ఇష్యూ.. ఎప్పుడంటే..

Rajinikanth | నేను మాట్లాడినా తప్పే.. మాట్లాడకపోయినా తప్పే : రజనీకాంత్





