త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balka Suman | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌కు బెయిల్

Balka Suman | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌( Balka Suman )కు బెయిల్ మంజూరైంది. ఈ మేర‌కు హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

S

Telangana | Published On Jun 24, 2026, 3.56 pm IST

Balka Suman | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌కు బెయిల్
Advertisement

Balka Suman | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌( Balka Suman )కు బెయిల్ మంజూరైంది. ఈ మేర‌కు హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. రూ. 25 వేలు, ఇద్ద‌రు పూచీక‌త్తుల‌తో సుమ‌న్‌కు బెయిల్ మంజూరైంది. సింగరేణి కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో బాల్క సుమ‌న్‌ను నాంప‌ల్లి పోలీసులు మే 30వ తేదీన‌ అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం ఆరున్న‌ర గంట‌ల పాటు విచారించి.. కింగ్ కోఠి హాస్పిట‌ల్‌లో వైద్యప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ఆయ‌న‌ను నాంప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా, 14 రోజుల రిమాండ్ విధించ‌డంతో చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు. దాదాపు 20 రోజుల‌కు పైగా సుమ‌న్ చంచ‌ల్‌గూడ జైల్లో ఉన్నారు.

చంచ‌ల్‌గూడ జైల్లో ఉన్న బాల్క సుమ‌న్‌ను బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావుతో పాటు ప‌లువురు నేత‌లు ప‌రామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. వారం రోజుల క్రితం సుమ‌న్ కుటుంబ స‌భ్యుల‌ను కూడా కేటీఆర్ ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. ఎట్ట‌కేల‌కు సుమ‌న్‌కు బెయిల్ మంజూరు కావ‌డంతో పార్టీ శ్రేణులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement