Rahul Gandhi | త్వరలోనే ఆర్థిక తుఫాను.. ముందెన్నడూ చూడని విధంగా ఉంటుంది.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi | దేశంలో త్వరలోనే ఆర్థిక తుఫాను (economic storm) రాబోతోందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. "రానుంది గడ్డుకాలం. ఇది ముందెన్నడూ చూడని విధంగా ఉంటుంది. కష్టకాలం ముంగిట ఉంది" అని రాహుల్ తీవ్ర హెచ్చరికలు చేశారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో త్వరలోనే ఆర్థిక తుఫాను (economic storm) రాబోతోందని హెచ్చరించారు. ప్రజలంతా ఆర్థిక భారాన్ని ఎదుర్కోక తప్పదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) ఐదు దేశాల పర్యటనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సంక్షోభ సమయాల్లో విదేశీ పర్యటనలు చేయొద్దంటూ ప్రజలకు చెబుతున్న ప్రధాని.. ఆయన మాత్రం స్వయంగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నారని వ్యాఖ్యానించారు. "సంక్షోభ సమయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు చేయొద్దని ప్రజలకు చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం స్వయంగా ప్రపంచమంతా తిరుగుతున్నారు" అని రాహుల్ ఎద్దేవా చేశారు.
మోదీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో త్వరలోనే ఆర్థిక తుఫాను రాబోతోందన్నారు. రాబోయే ఆర్థిక సంక్షోభం గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందని హెచ్చరించారు. అయితే, ఈ సంక్షోభం అదానీ, అంబానీలను కానీ, ప్రధానమంత్రిని కానీ ప్రభావితం చేయదని.. సామాన్య ప్రజలపై మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని రాహుల్ పేర్కొన్నారు. "రానుంది గడ్డుకాలం. ఇది ముందెన్నడూ చూడని విధంగా ఉంటుంది. కష్టకాలం ముంగిట ఉంది" అని రాహుల్ తీవ్ర హెచ్చరికలు చేశారు.
Also Read..
కుళ్లిన కూరగాయలు, పురుగుపట్టిన పిండి.. లులు మాల్‌లో 150 కిలోల ఆహార పదార్థాలు సీజ్
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: గండ్ర వెంకటరమణ రెడ్డి
జలమండలిలో అవినీతి జలగ.. ఏసీబీ సోదాల్లో విస్తుపోయే నిజాలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






