త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Raids | జ‌ల‌మండ‌లిలో అవినీతి జ‌ల‌గ‌.. ఏసీబీ సోదాల్లో విస్తుపోయే నిజాలు

ACB Raids | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్‌హిల్స్‌లోని జలమండలి (HMWSSB) జీఎం ఎస్‌.ఎల్‌ కుమార్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఆయ‌న పేరిట రూ.100 కోట్ల న‌గ‌దు, కిలోన్న‌ర‌ బంగారం, నిజామాబాద్‌లో 3 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 6 ఓపెన్‌ ప్లాట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు ఉన్నట్లు ప్రాథ‌మికంగా గుర్తించారు.

S

Hyderabad | Published On May 19, 2026, 3.29 pm IST

ACB Raids | జ‌ల‌మండ‌లిలో అవినీతి జ‌ల‌గ‌.. ఏసీబీ సోదాల్లో విస్తుపోయే నిజాలు
Advertisement
  • ప్రాథ‌మికంగా కిలో బంగారం, రూ. 100 కోట్ల న‌గ‌దు గుర్తింపు
  • హైదరాబాద్‌లో ఆరు ఓపెన్ ప్లాట్లు, గేటెడ్ క‌మ్యూనిటీలో మూడు
  • నిజామాబాద్‌లో మూడెక‌రాల వ్య‌వ‌సాయ‌ భూమి గుర్తింపు
  • బంధువుల ఇళ్ల‌లోనూ కొన‌సాగుతున్న త‌నిఖీలు

ACB Raids | త్రినేత్ర‌.న్యూస్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్‌హిల్స్‌లోని జలమండలి (HMWSSB) జీఎం ఎస్‌.ఎల్‌ కుమార్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఆయ‌న పేరిట రూ.100 కోట్ల న‌గ‌దు, కిలోన్న‌ర‌ బంగారం, నిజామాబాద్‌లో 3 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 6 ఓపెన్‌ ప్లాట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు ఉన్నట్లు ప్రాథ‌మికంగా గుర్తించారు. అనంత‌రం ఆభ‌ర‌ణాల‌ను, వాటికి సంబంధించిన‌ ప‌త్రాల‌ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని 8 ప్రాంతాల్లో అతని బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.

కుమార్ రెడ్​హిల్స్​ డివిజన్​ జీఎంగా ​పని చేస్తుండ‌గా ఆయనపై అక్రమాస్తుల కేసు నమోదు అయింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు (ACB Officers) సికింద్రాబాద్‌లోని మల్లాపూర్‌లో ఉన్న కుమార్ నివాసంలో దాడులు చేశారు. రూ.1.10 కోట్ల నగదు, కిలోన్నర బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జనరల్ మేనేజర్ కూమార్ నుంచి వివరాలను సేకరిస్తున్నారు. సోదాల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

బ్యాంకు లాక‌ర్లు తెరిస్తే..

సోదాల సమయంలో జీఎం కుమార్​ ఇంట్లో అక్రమాస్తులను చూసి అధికారులు షాక్​ అయ్యారు. అతడి నివాసంలో రూ.1.10 కోట్ల నగదు, సుమారు కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలు బ్యాంక్​ల్లో లాకర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్​ లాకర్లు ఓపెన్​ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement