Gandra | ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: గండ్ర వెంకటరమణ రెడ్డి
Gandra | రాష్ట్రంలో ఆరుగాలం రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. గన్ని బ్యాగుల ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పలుమార్లు వెళ్లేందుకు సమయం కేటాయిస్తున్నప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
రైతు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి నిజమైన రైతు సమస్యలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో భారీగా తరుగు తీస్తున్నారని, వంద కిలోల ధాన్యానికి ఏడు కిలోలకు పైగా కోత విధిస్తున్నారని ఆరోపించారు. మక్కలు పండించిన రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, భూపాలపల్లి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మక్కలు కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచారని, రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గండ్ర గుర్తుచేశారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం యాప్ ప్రవేశపెట్టడం రైతులకు ఉపయోగం కంటే ఇబ్బందులు ఎక్కువగా తెచ్చిందన్నారు. జూన్ నెలలో యూరియా కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించిన గండ్ర.. రైతుల కన్నీళ్లకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని సర్కారును హెచ్చరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి





