Lulu Hypermarket | కుళ్లిన కూరగాయలు, పురుగుపట్టిన పిండి.. లులు మాల్‌లో 150 కిలోల ఆహార పదార్థాలు సీజ్
Lulu Hypermarket | హైదరాబాద్‌లోని అతిపెద్ద రిటైల్ స్టోర్ లులు హైపర్ మార్కెట్ (Lulu Hypermarket)లో ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food safety officials) తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పురుగులు పట్టిన పిండి, కుళ్లిపోయిన కూరగాయలను అధికారులు గుర్తించారు. సుమారు 150 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేసి పారబోశారు.
- హైదరాబాద్ లులు హైపర్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
- స్టోరేజ్ రూముల్లో పెద్ద ఎత్తున పురుగులు, కీటకాలు
- మీట్ సెక్షన్ వద్ద తీవ్రమైన దుర్వాసన..
Lulu Hypermarket | హైదరాబాద్‌లోని అతిపెద్ద రిటైల్ స్టోర్ లులు హైపర్ మార్కెట్ (Lulu Hypermarket)లో ఆహార పదార్థాల నాణ్యతపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల కిందట మాల్‌లో కొనుగోలు చేసిన మిక్చర్ ప్యాకెట్‌లో ఫ్రైడ్ బల్లి వచ్చిందంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో హైపర్ మార్కెట్‌పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food safety officials) తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పురుగులు పట్టిన పిండి, కుళ్లిపోయిన కూరగాయలను అధికారులు గుర్తించారు. సుమారు 150 కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేసి పారబోశారు.
ఇన్ హౌస్ కిచెన్ మొత్తం అపరిశుభ్రమే..
హైపర్ మార్కెట్‌లోని ఇన్-హౌస్ కిచెన్, రిటైల్, మీట్ కౌంటర్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, అక్కడ అపరిశుభ్రత, ఆహార నిల్వల్లో అనేక లోపాలను గుర్తించారు. ఇన్‌హౌస్ కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించిన తనిఖీ బృందం.. వాటిని అక్కడికక్కడే పారబోసింది. అంతేకాదు, కిచెన్ పరిసరాలు, స్టోరేజ్ రూముల్లో పెద్ద ఎత్తున పురుగులు, కీటకాలు తిరుగుతున్నట్లు తేలింది. కుళ్లిపోయిన కూరగాయలను కూడా అధికారులు గుర్తించి పడేశారు. గడువు ముగిసిపోవడానికి దగ్గరగా ఉండి... వాటిపై చిరిగిన, ట్యాంపరింగ్ చేసేలా లేబుళ్లతో ఉన్న ప్యాక్ చేసిన కొన్ని ఆహార పదార్థాలు కూడా తనిఖీల్లో లభ్యమయ్యాయి.
ఆహార ఉత్పత్తుల్లో పురుగులు..
ఇక స్టోర్‌లోని రిటైల్ విభాగంలో కూడా అనేక లోపాలను అధికారులు గుర్తించారు. శనగపిండి, గోధుమ పిండి, పప్పుధాన్యాలు వంటి ఆహార ఉత్పత్తుల్లో పురుగులు తిరుగుతుండటాన్ని అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన FSSAI లైసెన్స్‌తో ఉన్న ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను గుర్తించారు. లేబులింగ్, డిస్‌ప్లే నియమాలను పూర్తిగా ఉల్లంఘించినట్లు తేలింది. కొన్ని ఉత్పత్తులపై పోషక విలువల సమాచారం, FSSAI లైసెన్స్ వివరాలు, తయారీదారుల చిరునామా లేకపోవడాన్ని గుర్తించారు.
మీట్ సెక్షన్ వద్ద తీవ్రమైన దుర్వాసన..
అంతేకాదు హైపర్ మార్కెట్‌లోని మాంసం విక్రయించే విభాగంలో కూడా అధికారులు విస్తృతంగా తనిఖీలు చేసి లోపాలను గుర్తించారు. మాంసం వ్యర్థాలతో డ్రైనేజీలు నిండిపోయి, తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతున్నట్లు తేలింది. ఇది ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
తనిఖీల్లో పురుగులు పట్టినట్లు గుర్తించిన స్వీట్లు, వంట నూనెలు, పిండి పదార్థాలు, పప్పుధాన్యాలు సహా సుమారు 150 కిలోల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ, రంగులు ఎక్కువగా వాడినట్లు అనుమానం ఉన్న ఆహార పదార్థాలు, పురుగులు పట్టిన పిండి నమూనాలను సేకరించి వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఈ తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులకు కీలక సూచనలు చేశారు. రిలైట్ దుకాణాలు, సూపర్ మార్కెట్లు, బేకరీలు, హోటళ్లు/రెస్టారెంట్ల నుంచి ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
#CFS_telangana - Based on the complaint received, Food Safety officials conducted an inspection at M/s Lulu Hypermarket, KPHB Colony and detected multiple serious violations across the premises.
🔴 In-House Kitchen Violations:
• Poor hygiene conditions observed
• Leftover food… pic.twitter.com/b4s1bw9inh— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) May 18, 2026
Also Read..
చాట్ జీపీటీలో కొత్త ట్రెండ్.. ఫోటోలను వింటేజ్ స్టైల్‌లో మార్చే కొత్త ఇమేజ్ ప్రాంప్ట్‌లు ఇవే..
మరో వివాదంలో త్రిష కరుప్పు మూవీ - ఇళయరాజా ఫ్యాన్స్ ఫైర్ - క్షమాపణలు చెప్పిన మేకర్స్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




