త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bomb threat | అమితాబ్‌, బాంబే హైకోర్టు, బీఎస్ఈకి వ‌రుస బాంబు బెదిరింపులు.. ముంబైలో హై అల‌ర్ట్‌

Bomb threat | ముంబైలో వ‌రుస బాంబు బెదిరింపులు (Bomb threat) క‌ల‌క‌లం రేపాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) బంగ్లా జ‌ల్సా, బాంబే హైకోర్టు (Bombay High Court), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల‌ను (Bombay Stock Exchange) లక్ష్యంగా చేసుకొని వ‌రుస బెదిరింపులు వ‌చ్చాయి.

D

National | Published On Nov 6, 2026, 2.46 pm IST

Bomb threat | అమితాబ్‌, బాంబే హైకోర్టు, బీఎస్ఈకి వ‌రుస బాంబు బెదిరింపులు.. ముంబైలో హై అల‌ర్ట్‌
Advertisement

Bomb threat | త్రినేత్ర న్యూస్ : దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో వ‌రుస బాంబు బెదిరింపులు (Bomb threat) క‌ల‌క‌లం రేపాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) బంగ్లా జ‌ల్సా, బాంబే హైకోర్టు (Bombay High Court), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల‌ను (Bombay Stock Exchange) లక్ష్యంగా చేసుకొని వ‌రుస బెదిరింపులు వ‌చ్చాయి. వీటితోపాటూ వర్లీ రేస్ కోర్స్‌లో (Worli Racecourse) కూడా బాంబు దాడులు జ‌రుగుతున్నాయ‌ని హెచ్చ‌రిస్తూ ఆగంత‌కులు కోర్టుకు ఒక బెదిరింపు మెయిల్ పంపారు.

బెదిరింపు మెయిల్‌తో అప్ర‌మ‌త్త‌మైన‌ ముంబై పోలీసులు న‌గ‌ర‌మంతా హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఆయా ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్‌, బాంబ్ స్క్వాడ్‌తో త‌నిఖీలు చేప‌ట్టారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన త‌నిఖీల్లో ఎలాంటి పేలుడు ప‌దార్థాలూ, అనుమానాస్ప‌ద వ‌స్తువులూ ల‌భించ‌లేదు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

కాగా, బిగ్‌బీని టార్గెట్ చేస్తూ బాంబు బెదిరింపులు రావ‌డం ఇది రెండోసారి కావ‌డం గ‌మ‌నార్హం. అక్టోబ‌ర్ 22న న‌గ‌రంలోని ఓ పాఠ‌శాల‌కు కూడా ఇలాంటి బెదిరింపులే వ‌చ్చాయి. అందులో బిగ్‌బీ పేరును ప్ర‌స్తావించిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇక ముంబై మేయర్ రీతూ తావ్డేకు వచ్చిన ఓ బెదిరింపు ఈమెయిల్‌లో కూడా అమితాబ్ నివాసం 'జల్సా'ను పేల్చివేస్తామని హెచ్చరికలు వ‌చ్చాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన‌ పోలీసులు ఆయనకు భద్రత పెంచారు. వ‌రుస బెదిరింపుల నేప‌థ్యంలో ప్రతి ఆదివారం ఇంటి బయట గుమిగూడే వేలాది మంది అభిమానులను పలకరించే అమితాబ్.. గ‌త‌ వారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచే చేతులెత్తి అభివాదం చేశారు.

Also Read..

ఢిల్లీ వెద‌ర్‌ను ఆస్వాదిస్తున్నారని అనుకుంటున్నా.. కాలుష్య సంక్షోభంపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

జీవో నెం.14తో బందీఖానాలుగా బీసీల ఆత్మ‌గౌర‌వం

నవంబర్ 8న దీపావళి ముహూరత్ ట్రేడింగ్.. ప్రత్యేక సెషన్ వేళలు ఇవే..

Advertisement
Advertisement