Srinivas Goud | జీవో నెం.14తో బందీఖానాలుగా బీసీల ఆత్మగౌరవం
Srinivas Goud | బీసీల ఆత్మగౌరవాన్ని జీవో నెం. 14తో కాంగ్రెస్ ప్రభుత్వం బందీఖానాలుగా మార్చింది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఇదేమైనా రాచరికమా? అంబేడ్కర్ రాజ్యాంగం తెలంగాణలో అమలు కాదా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ ఇచ్చిన జీవోలను రద్దు చేయడం ఏంటి..?
ప్రజల సొత్తుపై అధికారుల ఆజమాయిషీ ఏమిటి?
బీసీలను మళ్లీ బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందా?
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud | త్రినేత్ర న్యూస్ : బీసీల ఆత్మగౌరవాన్ని జీవో నెం. 14తో కాంగ్రెస్ ప్రభుత్వం బందీఖానాలుగా మార్చింది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఇదేమైనా రాచరికమా? అంబేడ్కర్ రాజ్యాంగం తెలంగాణలో అమలు కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ బీసీల ఆత్మగౌరవ భవనాల కోసం జీవోలు ఇస్తే, వాటిని రద్దు చేయడం ఏమిటి? అని అడిగారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో అన్ని కుల సంఘాలు పాల్గొన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు ధ్వంసమయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే తమ సమస్యలు పరిష్కారమవుతాయని కుల సంఘాల సభ్యులు భావించారు. హైదరాబాద్‌లో కుల సంఘాలకు కేసీఆర్ అత్యంత విలువైన స్థలాలను కేటాయించి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. మీరు భూములు ఇచ్చారా? భవనాలు కట్టించారా? ఎకరానికి రూ. 200 కోట్లు పలికే భూములను కేసీఆర్ ఉచితంగా ఇచ్చారు. కుల సంఘాలు ట్రస్టులుగా ఏర్పడిన తర్వాతే కేసీఆర్ భూములను కేటాయించారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
వెంటనే జీవో నెం. 14ను ఉపసంహరించుకోవాలి..
ప్రజల సొత్తుపై అధికారుల ఆజమాయిషీ ఏమిటి? బీసీలను మళ్లీ బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందా? పొన్నం ప్రభాకర్‌కు తెలిసే ఈ జీవోను విడుదల చేశారా? తమకు తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయని మంత్రులు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. భూముల ధరలు పెరుగుతుంటే మా జాతుల ప్రజలు సంతోషించారు. తమకు కేటాయించిన స్థలాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి, తమ కులాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలను పెంచుకోవాలని కుల సంఘాల పెద్దలు భావించారు. ప్రభుత్వ జోక్యానికి అవకాశం కల్పించేలా జీవో నెం. 14 తీసుకురావడం బీసీలపై పిడుగు వేయడం లాంటిదే. వెంటనే జీవో నెం. 14ను ఉపసంహరించుకోవాలి. జీవో నెం. 14పై రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
మాకు ఎవ్వరూ బిచ్చం వేయాల్సిన అవసరం లేదు
కామారెడ్డి డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి? బీసీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్ అమలు ఏమైంది? ఏటా రూ. 20 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్న హామీ ఏమైంది? గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు చేసిన మంచి పనులను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వాగతించారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కేటాయించిన ఆత్మగౌరవ భవనాలే కావాలా? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసే కుట్రల్లో భాగంగానే జీవో నెం. 14 తీసుకొచ్చారు. భూముల ధరలు పెరిగినందుకే సీఎం రేవంత్ రెడ్డి బీసీ ఆత్మగౌరవ భవనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. మాకు ఎవ్వరూ బిచ్చం వేయాల్సిన అవసరం లేదు. బీసీలకు ఏమీ ఇవ్వకపోగా, ఉన్నవాటిని కూడా గుంజుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు. పోతూ పోతూ బీసీలను వేధించిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. జీవో నెం. 14కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరినీ సంఘటితం చేస్తాం. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక బీసీలకు కేటాయించే నిధులను రెట్టింపు చేస్తారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Videocon | వీడియోకాన్ మాజీ అధినేత దివాలా.. ఎస్బీఐ రూ.12,668 కోట్ల రికవరీ..
- ●Stubble Burning | పంజాబ్‌లో పంట వ్యర్థాల దగ్ధం తీవ్రరూపం.. 2,787 ఘటనలు, రూ.46.10 లక్షల ఫైన్
- ●Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో దీపావళి ధమాకా.. సెన్సెక్స్, నిఫ్టీ50 బుల్ ర్యాలీ..
- ●Jagtial | కాటేసిన కాంటా! పది నెలల పసిపాప బలి
- ●Vemulawada Graveyard Shelter | కొడుకు వైద్యం కోసం రూ.10 లక్షల అప్పు.. చివరికి బతకడానికి శ్మశానమే దిక్కు
- ●Chirumarthi Lingaiah | సాగర్ ఎక్కడ.. కుప్పం ఎక్కడ? 72 టీఎంసీల నీళ్లు పోతుంటే ఏం చేస్తున్నారు?

Videocon | వీడియోకాన్ మాజీ అధినేత దివాలా.. ఎస్బీఐ రూ.12,668 కోట్ల రికవరీ..

Stubble Burning | పంజాబ్‌లో పంట వ్యర్థాల దగ్ధం తీవ్రరూపం.. 2,787 ఘటనలు, రూ.46.10 లక్షల ఫైన్

Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో దీపావళి ధమాకా.. సెన్సెక్స్, నిఫ్టీ50 బుల్ ర్యాలీ..

Jagtial | కాటేసిన కాంటా! పది నెలల పసిపాప బలి




