త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Muhurat Trading 2026 | నవంబర్ 8న దీపావళి ముహూరత్ ట్రేడింగ్.. ప్రత్యేక సెషన్ వేళలు ఇవే..

Muhurat Trading 2026 | దీపావళి సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లు నవంబర్ 8న ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో మధ్యాహ్నం 2:05 నుంచి 2:20 గంటల వరకు ప్రీ-ఓపెన్ సెషన్ జరగనుండగా, మధ్యాహ్నం 2:20 నుంచి 3:30 గంటల వరకు ప్రధాన ముహూరత్ ట్రేడింగ్ సెషన్ కొనసాగనుంది. దీపావళి రోజున కొత్త పెట్టుబడులు, కొనుగోళ్లు ప్రారంభించడం శుభప్రదమనే సంప్రదాయంతో ఇన్వెస్టర్లు ఈ ప్రత్యేక ట్రేడింగ్‌లో పాల్గొంటారు.

S

Business | Published On Nov 6, 2026, 2.26 pm IST

Muhurat Trading 2026 | నవంబర్ 8న దీపావళి ముహూరత్ ట్రేడింగ్.. ప్రత్యేక సెషన్ వేళలు ఇవే..
Advertisement

Muhurat Trading 2026 | దీపావళి సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లు నవంబర్ 8న ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో మధ్యాహ్నం 2:05 నుంచి 2:20 గంటల వరకు ప్రీ-ఓపెన్ సెషన్ జరగనుండగా, మధ్యాహ్నం 2:20 నుంచి 3:30 గంటల వరకు ప్రధాన ముహూరత్ ట్రేడింగ్ సెషన్ కొనసాగనుంది. దీపావళి రోజున కొత్త పెట్టుబడులు, కొనుగోళ్లు ప్రారంభించడం శుభప్రదమనే సంప్రదాయంతో ఇన్వెస్టర్లు ఈ ప్రత్యేక ట్రేడింగ్‌లో పాల్గొంటారు.

బంగారం, వెండి ధ‌ర‌ల్లో అస్థిర‌త‌..

బంగారం, వెండి కొనుగోళ్ల విషయానికి వస్తే ఈ ఏడాది ధరల్లో భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అక్టోబర్‌లో బంగారం ధరలు సుమారు 7 శాతం, వెండి ధరలు దాదాపు 20 శాతం తగ్గినప్పటికీ నవంబర్ మొదటి వారంలో తిరిగి పుంజుకున్నాయి. నవంబర్ 6న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,103 డాలర్లకు, వెండి ధర 52 డాలర్లకు చేరింది. దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1.43 లక్షలు, వెండి ధర కిలోకు రూ.1.87 లక్షల వద్ద కొనసాగాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యంతో బంగారాన్ని ధరలు తగ్గినప్పుడు విడతలవారీగా కొనుగోలు చేయవచ్చు. వెండిలో కూడా అవకాశాలు ఉన్నప్పటికీ, ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండడంతో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా వేచి చూసి కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.

అప్ర‌మ‌త్త‌త అవ‌సరం..

ఇక ముహూరత్ ట్రేడింగ్‌లో స్టాక్స్ కొనుగోలు చేయాలనుకునే ఇన్వెస్టర్లు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. దీపావళి సందర్భంగా శుభారంభంగా షేర్లు కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, కేవలం ముహూర్తం ఉందని నాణ్యత లేని షేర్లలో పెట్టుబడి పెట్టకూడదు. బలమైన ఆర్థిక పునాదులు, స్థిరమైన ఆదాయం, మెరుగైన భవిష్యత్ వృద్ధి అవకాశాలు ఉన్న కంపెనీలను పరిశీలించి దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టాలి. ఇప్పటికే కొన్ని బ్రోకరేజ్ సంస్థలు సంవాత్ 2083 కోసం ఎంపిక చేసిన షేర్లను సిఫారసు చేశాయి. మార్కెట్ ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని మొత్తం పెట్టుబడిని ఒకేసారి పెట్టకుండా విడతలవారీగా కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముహూరత్ ట్రేడింగ్‌ను తక్షణ లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయాణానికి శుభారంభంగా చూడాలని పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement