త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramayana Piracy | రిలీజ్‌కు ముందే జాగ్ర‌త్త – “రామాయ‌ణ” పైర‌సీపై బాంబే హైకోర్టు కీల‌క ఆదేశాలు

రామాయ‌ణ మేక‌ర్స్‌కు పైర‌సీ భ‌యం ప‌ట్టుకుంది. పైర‌సీ బారిన సినిమా ప‌డ‌కుండా అడ్డుకోవ‌డానికి రామాయ‌ణ విడుద‌ల కావ‌డానికి ముందే బాంబే హైకోర్టును ఆశ్ర‌యించారు. కోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. రామాయ‌ణ గాథ ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్నారు.

N

Entertainment | Published On Nov 3, 2026, 5.28 pm IST

Ramayana Piracy | రిలీజ్‌కు ముందే జాగ్ర‌త్త  – “రామాయ‌ణ” పైర‌సీపై బాంబే హైకోర్టు కీల‌క ఆదేశాలు
Advertisement

Ramayana Piracy | ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన మైథాల‌జీ మూవీ రామాయ‌ణ న‌వంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. రామాయ‌ణ గాథ ఆధారంగా ద‌ర్శ‌కుడు నితీష్ తివారి ఈ సినిమాను తెర‌కెక్కించారు. పాన్ ఇండియ‌న్ వైడ్‌గా హిందీ, తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లో రిలీజ్ అవుతోంది. దాదాపు నాలుగు వేల కోట్ల బ‌డ్జెట్‌తో రెండు పార్ట్‌లుగా రూపొందించారు.

పైర‌సీ భ‌యం...

రామాయ‌ణ మేక‌ర్స్‌కు పైర‌సీ భ‌యం ప‌ట్టుకుంది. దాంతో రిలీజ్‌కు ముందే బాంబే హైకోర్టును ఆశ్ర‌యించారు. పైర‌సీని అడ్డుకునేలా ముంబై హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్వ‌ర్తులు జారీ చేసింది. ప‌లు సూచ‌న‌లు ఇచ్చింది. ఈ సినిమాను థియేట‌ర్ల‌లో అన‌ధికారికంగా రికార్డ్ చేయ‌డం, పైర‌సీ సైట్ల‌లో అప్‌లోడ్, స్ట్రీమింగ్ చేయ‌డంపై నిషేదం విధించింది. అంతే కాకుండా పైర‌సీ కంటెంట్ ఉన్న లింక్‌లు, వెబ్‌సైట్ల‌ను గుర్తించి బ్లాక్ చేయ‌డ‌మో లేదంటో తొల‌గించ‌డ‌మో చేయాల‌ని ఇంట‌ర్‌నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌తో పాటు సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల‌ను ఆదేశించింది.

రెండు వేల కోట్లు...

రామాయ‌ణ తొలి భాగం కోస‌మే మేక‌ర్స్ రెండు వేల కోట్లు ఖ‌ర్చుచేసిన‌ట్లు స‌మాచారం. బ‌డ్జెట్‌కు త‌గినంత హైప్‌, బ‌జ్ మాత్రం సినిమాపై లేదు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రామాయ‌ణ పార్ట్ వ‌న్‌కు సంబంధించి కేవ‌లం 78 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్ర‌మే జ‌రిగాయి. టికెట్ల రేట్లు పెంచ‌డం, రెవెన్యూ షేరింగ్ విష‌యంలో డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో నిర్మాత‌ల‌కు ఏర్ప‌డిన విభేదాల‌తో పాటు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల అనుకున్న‌దానికంటే త‌క్కువే బుకింగ్స్ జ‌రిగిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. వాటికి తోడు ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్ల‌కు నెగెటివ్ టాక్ రావ‌డం, వివాదాలు, విమ‌ర్శ‌లు ఈ సినిమాకు మైన‌స్‌గా మారాయి. ఇప్ప‌టికే ఈ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోన్న మేక‌ర్స్ పైర‌సీ కార‌ణంగా న‌ష్టాల బారిన ప‌డ‌కుండా ముందుగానే జాగ్ర‌త్త‌ప‌డి కోర్టును ఆశ్ర‌యించిన‌ట్లు చెబుతోన్నారు.

కాజ‌ల్ అగ‌ర్వాల్‌...

రామాయ‌ణ మూవీలో ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, స‌న్నీడియోల్‌తో పాటు ప‌లువురు బాలీవుడ్ స్టార్స్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హ‌న్స్ జిమ్మ‌ర్‌తో క‌లిసి ఏఆర్ రెహ‌మాన్ రామాయ‌ణ‌కు సంగీతం అందించారు.

 

 

ట్యాగ్స్:

BollywoodBombay High CourtMythology MovieNitish TiwariRamayana Film Piracy ProtectionRamayana MovieRamayana Movie Latest NewsRamayana Movie ReleaseRamayana Piracy CaseRanbir KapooeSai Pallavi
Advertisement
Advertisement