త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSPDCL | కొత్త విద్యుత్ క‌నెక్ష‌న్ ఇక ఈజీ.. TGSPDCL ఆన్‌లైన్ పోర్ట‌ల్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..!

TGSPDCL | మీరు కొత్త‌గా విద్యుత్ క‌నెక్ష‌న్ పొందాల‌నుకుంటున్నారా..? అయితే క‌రెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే ప‌నే లేదు. కొత్త విద్యుత్ క‌నెక్ష‌న్ పొంద‌డం ఇక నుంచి సుల‌భం. టీజీఎస్పీడీసీఎల్( TGSPDCL ) ఆన్‌లైన్ పోర్ట‌ల్ లేదా.. స‌మీపంలోని వినియోగ‌దారుల సేవా కేంద్రం ద్వారా సుల‌భంగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

S

Telangana | Published On Nov 6, 2026, 2.15 pm IST

TGSPDCL | కొత్త విద్యుత్ క‌నెక్ష‌న్ ఇక ఈజీ.. TGSPDCL ఆన్‌లైన్ పోర్ట‌ల్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..!
Advertisement

TGSPDCL | త్రినేత్ర న్యూస్ : మీరు కొత్త‌గా విద్యుత్ క‌నెక్ష‌న్ పొందాల‌నుకుంటున్నారా..? అయితే క‌రెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే ప‌నే లేదు. కొత్త విద్యుత్ క‌నెక్ష‌న్ పొంద‌డం ఇక నుంచి సుల‌భం. టీజీఎస్పీడీసీఎల్( TGSPDCL ) ఆన్‌లైన్ పోర్ట‌ల్ లేదా.. స‌మీపంలోని వినియోగ‌దారుల సేవా కేంద్రం ద్వారా సుల‌భంగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఆన్‌లైన్ పోర్ట‌ల్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోండి ఇలా..

  • మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి.
  • విద్యుత్ వినియోగ కేటగిరీ, సరఫరా రకం, అవసరమైన లోడ్‌ను ఎంపిక చేసుకోండి.
  • గుర్తింపు, యాజమాన్య లేదా నివాస ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • అధికారుల పరిశీలన, నెట్‌వర్క్ సామర్థ్య తనిఖీ.
  • అవసరమైతే అంచనా వ్యయం, రుసుముల వివరాలు తెలుసుకోండి.
  • అధికారికంగా రుసుములు చెల్లించి, ఒప్పందం, తనిఖీ ప్రక్రియ పూర్తి చేయండి.
  • క్షేత్రస్థాయి పనులు, మీటర్ ఏర్పాటు పూర్తయిన తర్వాత విద్యుత్ సర్వీసు పొందండి.

ముఖ్య గమనిక : TGSPDCL నుంచి విద్యుత్ సర్వీసు అధికారికంగా విడుదలయ్యే వరకు కొత్త కనెక్షన్‌ను లేదా అదనపు లోడ్‌ను వినియోగించవద్దు.

మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. అధికారిక మార్గాల్లోనే దరఖాస్తు చేసుకోండి. అధికారిక రుసుములు మాత్రమే చెల్లించండి.

వెబ్‌సైట్: http://tgsouthernpower.org

Advertisement
Advertisement