త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Palamuru-Rangareddy Project | పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వ‌లేం.. స్ప‌ష్టం చేసిన కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ‌

Palamuru-Rangareddy Project | తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (PRLIS) జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌద‌రి తెలిపారు. ఈమేర‌కు రాజ్య‌స‌భ‌లో సోమ‌వారం కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయ‌న‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

S

Telangana | Published On Aug 10, 2026, 3.31 pm IST

Palamuru-Rangareddy Project | పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వ‌లేం.. స్ప‌ష్టం చేసిన కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ‌
Advertisement
  • స‌మ‌గ్ర ప్ర‌ణాళిక త‌యారు చేసి పంపితే ప‌రిశీలిస్తాం
  • ఎంపీ రేణుకాచౌద‌రి అడిగిన ప్రశ్న‌కు లిఖిత‌పూర్వ‌కంగా స‌మాధాన‌మిచ్చిన కేంద్ర మంత్రి రాజ్ భూష‌ణ్ చౌద‌రి

Palamuru-Rangareddy Project | త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (PRLIS) జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో లేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌద‌రి తెలిపారు. ఈమేర‌కు రాజ్య‌స‌భ‌లో సోమ‌వారం కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయ‌న‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర వివాదాలు KWDT-II పరిధిలో న్యాయ విచారణలో ఉండటంతో టెక్నో-ఎకనామిక్ అప్రైజల్ చేపట్టలేమని వివ‌రించారు. PRLIS DPRను సమగ్ర ప్రణాళిక కోసం తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు వెల్లడించారు.

జాతీయ ప్రాజెక్టు హోదా నిబంధనలు ఉన్నప్పటికీ, PRLISను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అంశం కేంద్ర పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక సహాయంపై కూడా ఎలాంటి నిర్దిష్ట హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు.
కేంద్ర జల సంఘానికి (CWC) అందిన DPR ప్రకారంగా ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక పరిశీలనలు (Techno-Economic Appraisal) పూర్తయితేనే కేంద్ర సాయాన్ని పరిశీలించడానికి వీలవుతుందని మంత్రి తెలిపారు.

ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర అంశాలు ప్రస్తుతం కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్–II (KWDT-II) పరిధిలో ఉన్నందున, కేసు న్యాయస్థానం (Sub-judice) ముందుకు చేరిందని వివరించారు. సాధారణంగా జాతీయ ప్రాధాన్యం ఉన్న, అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ జల వివాదాలు ఉన్న, లేదా గణనీయమైన స్థాయిలో సాగునీటి సామర్థ్యాన్ని కల్పించే ప్రాజెక్టులకు PMKSY-AIBP మార్గదర్శకాల ప్రకారం జాతీయ హోదా కల్పిస్తారని ఆయ‌న‌ వివ‌రించారు.

Advertisement
Advertisement