త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Savings Account | ఐటీ నోటీసులు రావొద్దంటే బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో గ‌రిష్టంగా ఎంత పొదుపు చేయ‌వ‌చ్చు..?

Savings Account | దేశంలో దాదాపు 90 కోట్ల మందికి సేవింగ్స్ ఖాతాలు ఉన్నాయి. ముఖ్యంగా జన్‌ధన్ ఖాతాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగింది. సేవింగ్స్ ఖాతా ఉండటం వల్ల నగదు లావాదేవీలు సులభంగా నిర్వ‌హించ‌వచ్చు. అయితే చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఉంది.

S

Business | Published On Aug 10, 2026, 3.03 pm IST

Savings Account | ఐటీ నోటీసులు రావొద్దంటే బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో గ‌రిష్టంగా ఎంత పొదుపు చేయ‌వ‌చ్చు..?
Advertisement

Savings Account | దేశంలో దాదాపు 90 కోట్ల మందికి సేవింగ్స్ ఖాతాలు ఉన్నాయి. ముఖ్యంగా జన్‌ధన్ ఖాతాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగింది. సేవింగ్స్ ఖాతా ఉండటం వల్ల నగదు లావాదేవీలు సులభంగా నిర్వ‌హించ‌వచ్చు. అయితే చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు రాకుండా ఉండాలంటే సేవింగ్స్ ఖాతాలో ఎంత మొత్తంలో డబ్బు ఉంచుకోవచ్చు అనే విషయంపై చాలా మందికి అవ‌గాహన లేదు. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే ఈ ఆదాయపు పన్ను నిబంధన గురించి పూర్తిగా తెలుసుకోవడం అవ‌స‌రం. చాలామంది తమ డబ్బును భద్రత కోసం బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో ఉంచుతుంటారు. అయితే బ్యాంకు ఖాతాల‌లో అధిక మొత్తంలో డ‌బ్బును ఉంచ‌డం లేదా పెద్ద మొత్తంలో లావాదేవీల‌ను నిర్వ‌హించడం ఐటీ శాఖ దృష్టిని ఆక‌ర్షిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. అందువల్ల ముందుగానే నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా సేవింగ్స్ ఖాతాలో డబ్బు జమ చేసే ముందు నగదు జమకు సంబంధించిన పరిమితులు, ఇతర నిబంధనలపై స్పష్టత ఉంటుంది.

అనేక అంశాల‌తో నిర్దార‌ణ‌..

బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉందనే అంశం ఆధారంగా మాత్రమే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయదు. ముఖ్యంగా భారీ మొత్తంలో నగదు జమ చేయడం లేదా అనుమానాస్పద లావాదేవీలపై శాఖ దృష్టి సారిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ ఖాతాలో మొత్తం రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ అయితే బ్యాంకులు ఆ సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి. కరెంట్ ఖాతాల విషయంలో ఈ పరిమితి రూ.50 లక్షలుగా ఉంది. సేవింగ్స్ ఖాతాలకు సంబంధించిన రూ.10 లక్షల పరిమితిని ఒకే ఖాతాకు మాత్రమే కాకుండా, ఒక వ్యక్తికి ఉన్న బహుళ ఖాతాలను కలిపి కూడా పరిగణిస్తారు. అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి నగదు జమ చేస్తే ఆ సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. కరెంట్ ఖాతాలకు కూడా ఇదే తరహా నిబంధన వర్తిస్తుంది. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఖాతాలో నగదు రూపంలో డబ్బు జమ చేయకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి.

ఆదాయం వివ‌రాలు ఉంటే..

ఆదాయానికి సంబంధించిన మూలాలు స్పష్టంగా ఉండి, ఐటీఆర్‌లో సరైన వివరాలను వెల్లడించినట్లయితే సాధారణంగా ఎలాంటి సమస్య ఉండదు. అయితే ఆదాయానికి, బ్యాంకు ఖాతాలో జమ చేసిన మొత్తానికి మధ్య వ్యత్యాసం ఉంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పదేపదే భారీ మొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహించినా పన్ను నోటీసు వచ్చే అవకాశం ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయకుండా భారీ మొత్తంలో లావాదేవీలు నిర్వహించడం కూడా సమస్యలకు దారితీస్తుంది. పాన్ ఖాతాకు అనుసంధానం కాకపోయినా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా అనుమానాస్పద లావాదేవీని గుర్తించినా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంకు ఖాతాల‌లో రూ.10 లక్షలకు మించి డబ్బు ఉండటం మాత్రమే ఆదాయపు పన్ను నోటీసుకు కారణం కాదు. ముఖ్యంగా నగదు జమలు, లావాదేవీల స్వభావం, ఆదాయానికి సంబంధించిన వివరాలు వంటి అంశాలను శాఖ పరిశీలిస్తుంది.

Advertisement
Advertisement