త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | త‌మిళ ఓటీటీ షో – హోస్ట్‌గా స‌మంత – బిగ్‌బాస్‌తో పోటీకి రెడీ

మాతృభాష త‌మిళంలో ఫ‌స్ట్ టైమ్ ఓ ఓటీటీ షో చేయ‌బోతుంది స‌మంత‌. మాస్ట‌ర్ చెఫ్ త‌మిళ్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతుంది. సోనీలివ్ ఓటీటీలో టెలికాస్ట్ కానున్న మాస్ట‌ర్ చెఫ్ కోసం స‌మంత రికార్డ్ స్థాయిలో రెమ్యూన‌రేష‌న్‌ను స్వీక‌రించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Aug 10, 2026, 2.52 pm IST

Samantha | త‌మిళ ఓటీటీ షో – హోస్ట్‌గా స‌మంత – బిగ్‌బాస్‌తో పోటీకి రెడీ
Advertisement

Samantha | మా ఇంటి బంగారం మూవీతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చింది స‌మంత‌. విడాకులు, వ్య‌క్తిగ‌త జీవితంలోని ఒడిదుడుకుల కార‌ణంగా సినిమాల‌కు రెండేళ్లు గ్యాప్ ఇచ్చింది. స‌మంత క‌మ్‌బ్యాక్ ఇవ్వ‌డం క‌ష్ట‌మ‌ని, హీరోయిన్‌గా ఆమె ప‌నైపోయిందంటూ విమ‌ర్శ‌లొచ్చాయి. స‌మంత‌తో సినిమా చేయ‌డానికి నిర్మాత‌లు ఎవ‌రూ ముందుకు రాలేదు. దాంతో తానే నిర్మాత‌గా, హీరోయిన్‌గా మా ఇంటి బంగారం సినిమాను తెర‌కెక్కించింది.

తెలుగులో హ‌య్యెస్ట్‌...

కేవ‌లం 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ వంద కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. తెలుగులో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ స‌క్సెస్ జోష్‌ను కంటిన్యూ చేస్తూ తాను త‌ల్లి కాబోతున్న‌ట్లు మ‌రో గుడ్‌న్యూస్ వినిపించింది. ప్రెగ్నెన్సీ కార‌ణంగా సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన స‌మంత ఈ గ్యాప్‌లో ఓ త‌మిళ ఓటీటీ షోకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.

మాస్ట‌ర్ చెఫ్‌...

మాస్ట‌ర్ చెఫ్ త‌మిళ ఓటీటీ షోకు స‌మంత హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ది. సోనీలివ్‌లో ఈ రియాలిటీ షో టెలికాస్ట్ కాబోతుంది. మాస్ట‌ర్ చెఫ్ త‌మిళ షోకు ఫ‌స్ట్ సీజ‌న్‌లో విజ‌య్ సేతుప‌తి హోస్ట్‌గా క‌నిపించాడు. అత‌డి ప్లేస్‌లో స‌మంత న‌యా హోస్ట్‌గా ఈ కుక‌రీ షోలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

బిగ్‌బాస్‌కు పోటీగా...

బిగ్‌బాస్‌కు పోటీగా సెప్టెంబ‌ర్‌లో మాస్ట‌ర్ చెఫ్ మొద‌లుకాబోతుంది. ఈ ఓటీటీ షో కోసం స‌మంత భారీగా రెమ్యూన‌రేష‌న్‌ను స్వీక‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఒక్కో ఎపిసోడ్‌కు ఆరు కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓవ‌రాల్‌గా ఈ సీజ‌న్‌తో స‌మంత‌కు యాభై కోట్ల‌కుపైనే ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మాతృభాష త‌మిళంలో స‌మంత చేస్తోన్న ఫ‌స్ట్ ఓటీటీ షో ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.
గ‌తంలో తెలుగులో ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అయిన సామ్ జామ్ అనే టాక్ షోకు స‌మంత హోస్ట్‌గా అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది.

Advertisement
Advertisement