త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Paytm | పేటీఎం యూజ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక క్లాడ్ ఏఐతో చెల్లింపులు చేయ‌వ‌చ్చు..

Paytm | పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం త‌న యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ సంస్థ ప్ర‌ముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ కంపెనీ ఆంథ్రోపిక్‌తో భాగ‌స్వామ్యం అయింది. దీంతో పేటీఎం యూజ‌ర్లు ఇక ఆ ప్లాట్‌ఫామ్‌లో క్లాడ్ ఏఐ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. పేటీఎం పేమెంట్ గేట్‌వేతో ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ ఎంసీపీ (మోడ‌ల్ కాంటెక్ట్స్ ప్రోటోకాల్‌) క‌నెక్ట‌ర్ ద్వారా క‌నెక్ట్ అవ్వ‌చ్చ‌ని పేటీఎం ప్ర‌కటించింది.

S

Technology | Published On Aug 10, 2026, 3.34 pm IST

Paytm | పేటీఎం యూజ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక క్లాడ్ ఏఐతో చెల్లింపులు చేయ‌వ‌చ్చు..
Advertisement

Paytm | పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం త‌న యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ సంస్థ ప్ర‌ముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ కంపెనీ ఆంథ్రోపిక్‌తో భాగ‌స్వామ్యం అయింది. దీంతో పేటీఎం యూజ‌ర్లు ఇక ఆ ప్లాట్‌ఫామ్‌లో క్లాడ్ ఏఐ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. పేటీఎం పేమెంట్ గేట్‌వేతో ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ ఎంసీపీ (మోడ‌ల్ కాంటెక్ట్స్ ప్రోటోకాల్‌) క‌నెక్ట‌ర్ ద్వారా క‌నెక్ట్ అవ్వ‌చ్చ‌ని పేటీఎం ప్ర‌కటించింది. ఈ రెండింటినీ అనుసంధానం చేసినందున ఇకపై పేటీఎం యూజ‌ర్లు క్లాడ్ ఏఐ ద్వారా నేరుగా చెల్లింపులు చేయ‌డంతోపాటు పేటీఎం సేవ‌ల‌ను ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని తెలిపింది. పేటీఎం పేమెంట్ గేట్‌వే ఖాతాను క్లాడ్‌తో అనుసంధానించిన తర్వాత వ్యాపారులు సంభాషణాత్మక ప్రాంప్ట్‌ల ద్వారా లావాదేవీలు, పేమెంట్ లింకులు, రీఫండ్‌లు, సెటిల్‌మెంట్లు, సబ్‌స్క్రిప్షన్లు, ఆర్డర్ స్టేటస్, రీకన్సిలియేషన్ వివరాలను తెలుసుకోవచ్చు.

వివ‌రాల‌న్నీ ఒకే వేదిక‌పై..

ఇప్పటివరకు ఈ వివరాల కోసం వ్యాపారులు పేటీఎం డ్యాష్‌బోర్డ్‌లోని వివిధ పేజీలకు వెళ్లడం, ప్రత్యేక నివేదికలను పరిశీలించడం లేదా నేరుగా ఏపీఐ కాల్స్ చేయాల్సి వచ్చేది. కొత్త ఇంటిగ్రేషన్‌తో ఈ ప్రక్రియ మరింత సులభత‌రం కానుంది. వ్యాపారవేత్తలు తమ కలెక్షన్లను తెలుసుకోవచ్చు. ఫైనాన్స్ బృందాలు సెటిల్‌మెంట్లు, రీకన్సిలియేషన్ వివరాలను పరిశీలించవచ్చు. కస్టమర్ సపోర్ట్ బృందాలు పేమెంట్ లేదా రీఫండ్ స్టేటస్‌ను తనిఖీ చేయవచ్చు. డెవలపర్లు కూడా ఏఐ ఆధారిత వర్క్‌ఫ్లోల కోసం తమకు అధీకృత పేమెంట్ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. వ్యాపార కార్యకలాపాల బృందాలు, డెవలపర్లు, ఏఐ ఆధారిత వాణిజ్య వర్క్‌ఫ్లోలను రూపొందించే వ్యాపారవేత్తలకు కూడా ఈ ఇంటిగ్రేషన్ ఉపయోగపడనుంది. ఎంసీపీ ప్రమాణం ద్వారా క్లాడ్‌ను పేటీఎం పేమెంట్ గేట్‌వే ఏపీఐలతో అనుసంధానిస్తారు. ఈ యాక్సెస్ పూర్తిగా ధ్రువీకరించబడిన, వ్యాపారి అనుమతించిన విధానంలోనే కొనసాగుతుంది.

భ‌ద్ర‌త‌కు ప్రాధాన్య‌త‌..

భద్రత, యాక్సెస్ కంట్రోల్‌కు కూడా ఈ ఇంటిగ్రేషన్‌లో ప్రాధాన్యత ఇచ్చినట్లు పేటీఎం తెలిపింది. వ్యాపారాలు సురక్షితమైన ధ్రువీకరణ విధానం ద్వారా తమ మర్చంట్ ఖాతాలను అనుసంధానించవచ్చు. ఏ సమాచారం యాక్సెస్ చేయాలనే అంశంపై వ్యాపారులకే నియంత్రణ ఉంటుంది. అధీకృత అనుమతుల మేరకు మాత్రమే పేమెంట్ సమాచారం క్లాడ్‌కు అందుతుంది. అయితే పేమెంట్ అమలు, రీఫండ్‌లు, సెటిల్‌మెంట్ల వంటి కీలక ప్రక్రియలు మాత్రం వ్యాపారి నియంత్రణలోనే ఉంటాయి. ఈ ప్రక్రియలు పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ మౌలిక సదుపాయాలపైనే కొనసాగుతాయి. పేమెంట్ సంబంధిత వర్క్‌ఫ్లోల కోసం పేటీఎం పేమెంట్ గేట్‌వేను ఉపయోగిస్తున్న వ్యాపారాలు, ఎంఎస్‌ఎంఈలు, ఎంటర్‌ప్రైజ్‌లు, డెవలపర్లకు ఈ ఇంటిగ్రేషన్ అందుబాటులోకి వచ్చింది.

ఏఐ వాస్తవ ప్రపంచంలోని వర్క్‌ఫ్లోలతో సురక్షితంగా అనుసంధానమైనప్పుడే వ్యాపారాలకు నిజమైన విలువను అందిస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ ద్వారా వ్యాపారవేత్తలు, డెవలపర్లు, బిజినెస్ బృందాలు భద్రత, అధీకృత యాక్సెస్ వంటి సదుపాయాలతో పేమెంట్ సమాచారాన్ని మరింత వేగంగా పొందవ‌చ్చ‌ని పేటీఎం పేమెంట్ గేట్‌వే ప్రతినిధి ఒక‌రు తెలిపారు.

Advertisement
Advertisement