Tabu | ఫియర్‌లెస్…రూత్‌లెస్…ఫస్ట్ టైమ్ మాస్ రోల్‌లో టబు – స్లమ్ డాగ్ గ్లింప్స్ రిలీజ్
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ పేరుతో ఓ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి టబు ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను సోమవారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో టబు కనిపించబోతున్నది.
Entertainment | Published On Aug 10, 2026, 3.30 pm IST
Tabu | పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోల పాత్రలు పవర్‌ఫుల్‌గా ఉంటాయి. రఫ్ అండ్ టఫ్‌గా క్యారెక్టర్లను స్క్రీన్‌పై ఆవిష్కరిస్తుంటారు. కానీ ఫస్ట్ టైమ్ హీరో కాకుండా హీరోయిన్ రోల్‌ను అగ్రెసివ్‌గా స్క్రీన్‌పై చూపించబోతున్నారు. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ పేరుతో ఓ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది.
గౌరీ హెగ్డే...
ఈ సినిమా నుంచి టబు ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో భయానికి మీనింగ్ తెలియని లేడీ ఆఫీసర్‌గా టబు కనిపిస్తోంది. గౌరి హెగ్డే అనే క్యారెక్టర్‌లో కనిపించబోతుంది. స్లమ్ ఏరియాను చూపిస్తూ గ్లింప్స్ మొదలైంది. ఆ తర్వాత కారు దిగుతూ, సిగరెట్ వెలిగించి మాసీ రోల్‌లో టబు పాత్ర గ్లింప్స్‌లో కనిపించింది. తనకు అడ్డొచ్చిన వారు ఎవరన్నది చూడకుండా తుక్కురేగ్గొడుతూ ఈ గ్లింప్స్‌లో టబు పాత్ర కనిపించడం ఆసక్తిని పంచుతోంది. మా ఓల్డ్ సిటీలో ముందు కాలుస్తాం...ఆ తర్వాత మాట్లాడుతాం అంటూ టబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ఫియర్‌లెస్ ఉమెన్...
ఫియర్ లెస్ ఉమెన్, పవర్‌ఫుల్ ఆఫీసర్, రూత్‌లెస్, డెవిల్ ఇది ది డిపార్ట్‌మెంట్ అంటూ టబు క్యారెక్టర్ గురించి ఇతర పాత్రధారులు డైలాగ్స్ చెప్పడం....చివరలో “గౌరి హెగ్డే, డిప్యూటీ కమిషనర్, ఇన్‌కమ్ ట్యాక్స్” అంటూ టబు తనను తాను పరిచయం చేసుకునే సీన్‌తో గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. ఈ ఇంట్రడక్షన్‌లో పూరి జగన్నాథ్ మార్క్ కనిపిస్తోంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలో టబు లుక్స్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ పాత్రపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
సంయుక్త మీనన్...
స్లమ్ డాగ్ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ హీరో దునియా విజయ్ విలన్‌గా కనిపించబోతున్నాడు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు యానిమల్, అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు.ఛార్మీ కౌర్ తో కలిసి పూరి జగన్నాథ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంబంధిత వార్తలు

Bhogi Teaser | భోగి టీజర్ రిలీజ్ – రగ్గ్డ్ లుక్‌లో శర్వానంద్ – తెలంగాణ అమ్మాయిగా అనుపమ
అక్టోబర్ 4, 2026

Raashi Khanna | సమంత భర్త బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి రాశీఖన్నా ఔట్ – టాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్
అక్టోబర్ 4, 2026

Kayadu Lohar | రెట్రో లుక్‌లో కయదు – క్యూట్ ఫాటోలతో మాయ చేసిన ప్యారడైజ్ హీరోయిన్
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగించినట్టు కాదు
- ●Drinking Water | హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటల పాటు మంచినీళ్లు బంద్
- ●Bhogi Teaser | భోగి టీజర్ రిలీజ్ - రగ్గ్డ్ లుక్‌లో శర్వానంద్ - తెలంగాణ అమ్మాయిగా అనుపమ
- ●Asaduddin Owaisi | ఆ సూపరింటెండెంట్ లంచాలు తీసుకొని రౌడీషీటర్లను వదులుతున్నరు
- ●KTR | కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం.. కాలిఫోర్నియా ఆరోగ్య సదస్సుకు ఆహ్వానం
- ●Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లా వాసి మృతి

Ramchandar Rao | ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగించినట్టు కాదు

Drinking Water | హైదరాబాదీలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36 గంటల పాటు మంచినీళ్లు బంద్

Bhogi Teaser | భోగి టీజర్ రిలీజ్ - రగ్గ్డ్ లుక్‌లో శర్వానంద్ - తెలంగాణ అమ్మాయిగా అనుపమ

Asaduddin Owaisi | ఆ సూపరింటెండెంట్ లంచాలు తీసుకొని రౌడీషీటర్లను వదులుతున్నరు



