Air India Flight | హైజాక్ పుకార్లు.. ఫ్రాంక్ఫర్ట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం దారిమళ్లింపు
Air India Flight | సెక్యూరిటీ అలర్ట్ నేపథ్యంలో ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని (Air India Flight) జైపూర్‌కు దారిమళ్లించారు. దీంతో జైపూర్ (Jaipur) అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
Air India Flight | త్రినేత్ర న్యూస్: సెక్యూరిటీ అలర్ట్ నేపథ్యంలో ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని (Air India Flight) జైపూర్‌కు దారిమళ్లించారు. దీంతో జైపూర్ (Jaipur) అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రాథమిక నివేదికల ప్రకారం బాంబు బెదిరింపు అని భావించినప్పటికీ, విమానాన్ని హైజాక్ చేస్తున్నారనే పుకారు (Hijack Rumour) రావడంతో ఈ హెచ్చరిక జారీ అయిందని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. కాగా, విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
ఎయిర్ ఇండియాకు చెందిన AI 2030 విమానం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నుంచి ఢిల్లీకి (Delhi) వస్తున్నది. ఈ క్రమంలో భారత గగణతలంలోకి వచ్చిన తర్వాత విమానాన్ని హైజాక్ చేస్తున్నారనే పుకార్లు రావడంతో సెక్యూరిటీ అలర్ట్ (Security Alert) జారీచేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని జైపూర్‌కు దారిమళ్లించారు. విమానం అక్కడ ల్యాండ్ అయిన తర్వాత దానిని ఐసోలేషన్ బే (ప్రత్యేక ప్రాంతం)కి తరలించారు. అక్కడ సీఐఎస్ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS) సిబ్బంది విమానాన్ని, ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
కాగా, ఇది హైజాక్ పుకారు మాత్రమేనని, బాంబు బెదిరింపు (Bomb Threat) కాదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక విమానాశ్రయ అధికారి తెలిపారు. దీనిపై ఇప్పుడే అధికారికంగా స్పందించడం చాలా తొందరపాటు అవుతుందన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్నదని చెప్పారు. అయితే ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు కానీ, ఎయిర్ ఇండియా కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
తాజావార్తలు
- ●TG SAFE | కిచెన్‌లో అపరిశుభ్రత.. 4 హోటళ్ల లైసెన్సులు రద్దుచేసిన టీజీ సేఫ్
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. మార్కెట్లలో అనిశ్చితి..
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చేరిన ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను షెడ్యూల్ చేయవచ్చు..
- ●CJP | సీజేపీ నేతలకు జ్యుడీషియల్ కస్టడీ.. తీహార్ జైలుకు సౌరవ్ దాస్, రాంకా
- ●Stock Markets | స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్ల జోరు..

TG SAFE | కిచెన్‌లో అపరిశుభ్రత.. 4 హోటళ్ల లైసెన్సులు రద్దుచేసిన టీజీ సేఫ్

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. మార్కెట్లలో అనిశ్చితి..

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో చేరిన ఆమ్చా గ్రీన్ లాతూర్ వృక్ష ఫౌండేషన్

WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లను షెడ్యూల్ చేయవచ్చు..






