Software Engineer | హీలియం గ్యాస్ పీల్చుకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణం
Software Engineer | హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (Software Engineer) బలవన్మరణానికి పాల్పడ్డారు. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని హీలియం గ్యాస్ (Helium Gas) పీల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
Software Engineer | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (Software Engineer) బలవన్మరణానికి పాల్పడ్డారు. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని హీలియం గ్యాస్ (Helium Gas) పీల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానాకు చెందిన సౌరభ్ శేఖర్ (36) మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. రాయదుర్గంలోని నాలెడ్జీసిటీలోని మై హోం భూజలో సోదరుడు లక్ష్య శేఖర్ వద్ద ఉంటున్నారు.
స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నాని చెప్పి బయటకు వెళ్లారు. కొండాపూర్‌లోని (Kondapur) రాజరాజేశ్వరీనగర్‌లోని వీవీ హైట్స్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టారు. అయితే కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అతని సోదరుడు వాట్సాప్‌లో పంపిన అడ్రస్‌కు వెళ్లారు. తలుపు కొట్టినా తీయకపోవడంతో బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అయితే తలకు ప్లాస్టిక్ కవర్, హీలియం సిలిండర్ పెట్టుకొని చనిపోయి ఉన్నాడు. అమ్మానాన్న క్షమించండి అంటూ శేఖర్ రాసిన సూసైడ్ నోట్‌ని గుర్తించారు. గత పదేండ్లుగా సౌరభ్ కడుపునొప్పితో (Stomach Pain) బాధపడుతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. అన్నం తినగానే కడుపు నొప్పి రావడం, వాంతులు అవడం జరుగుతున్నాయని వెల్లడించారు. ఎలాంటి బాధ లేకుండా చనిపోయేందుకు హీలియం గ్యాస్ వాడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bhagat Singh | పంజాబ్ ఓటరు జాబితాలో స్వాతంత్య్ర సమరయోధుడి ఫొటో..
- ●Anganwadi Recruitment | అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ ఉద్యోగాలు.. ఆసిఫాబాద్, వికారాబాద్ జిల్లాల్లో 697 ఖాళీలు
- ●Father Funeral | ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను ఆపిన కూతుర్లు..
- ●Strike | సమ్మె బాటలో జూనియర్ డాక్టర్లు.. ఉస్మానియాలో నిలిచిపోనున్న సేవలు
- ●Horoscope | అక్టోబర్ 12 రాశిఫలాలు.. వినూత్న ఆలోచనలు అవసరం!
- ●Kobali Lyrical Song Release | గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ 'రణబాలి' - 'కోబలి' సాంగ్ వచ్చేసింది

Bhagat Singh | పంజాబ్ ఓటరు జాబితాలో స్వాతంత్య్ర సమరయోధుడి ఫొటో..

Anganwadi Recruitment | అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ ఉద్యోగాలు.. ఆసిఫాబాద్, వికారాబాద్ జిల్లాల్లో 697 ఖాళీలు

Father Funeral | ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను ఆపిన కూతుర్లు..

Strike | సమ్మె బాటలో జూనియర్ డాక్టర్లు.. ఉస్మానియాలో నిలిచిపోనున్న సేవలు






