Earthquake | ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. 40 మంది మృతి
Earthquake | ఇండోనేషియా (Indonesia) వరుస భూకంపాలతో (Earthquake) వణికిపోయింది. 24 గంటల వ్యవధిలోనే మూడుసార్లు భూమి కంపించింది. ఈ ప్రకంపనల కారణంగా ఇప్పటి వరకూ 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.
Earthquake | త్రినేత్ర.న్యూస్ : ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపసముదాయ దేశమైన ఇండోనేషియా (Indonesia) వరుస భూకంపాలతో (Earthquake) వణికిపోయింది. శనివారం తెల్లవారుజామున ఫ్లోరెస్ ద్వీపం (Flores Island) సమీపంలో రిక్టరు స్కేలుపై 6.1, 7.7 తీవ్రతతో భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే తాజాగా 6.8 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సుమత్రా (Sumatra) ప్రాంతంలో భూమికి 168 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (German Research Centre for Geosciences) తెలిపింది.
ఇక వరుస భూకంపాలతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఉదయం సంభవించిన అత్యంత శక్తిమంతమైన భూకంపం కారణంగా అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. దాదాపు 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అనేక మంది గాయపడినట్లు నివేదించింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే మూడుసార్లు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, 2004లో 9.1 తీవ్రతతో సుమత్ర (Sumatra) తీరంలో భారీ భూకంపం వచ్చింది. దీంతో ఇండోనేషియాలో 1.70 లక్షల మంది మరణించారు. ఆ తర్వాత 2018లో లొమ్‌బోక్ దీవిలో భారీ భూకంపం వచ్చింది. వరుసగా రెండు వారాలపాటు భూమికంపించింది. ఈ నేపథ్యంలో హాలిడే ద్వీపం, దాని సమీపంలోని సుంబావా ద్వీపంలో 550 మందికిపైగా మృతిచెందారు.
Also Read..
అదే జరిగిఉంటే.. పీవోకే ప్రజలు ఎప్పుడో జమ్ము కశ్మీర్‌లో కలిసిపోయేవారు : ఒమర్ అబ్దుల్లా
రూ.3,000 యూరియా బస్తాను రూ.300కే అందిస్తున్నాం : ప్రధాని మోదీ
మాయగాళ్ల మాయలో పడకండి.. ప్రతి 6 నెలలకు ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
తాజావార్తలు
- ●OpenAI | చాట్ జీపీటీ ఇక మరింత వేగవంతం.. అప్‌గ్రేడ్ చేసిన ఓపెన్ ఏఐ..
- ●Megastar | గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని అర్ధరాత్రి దారి తప్పిన మెగాస్టార్ - సాయం చేసిన అభిమాని
- ●CM Revanth Reddy | నా మీదనో, మహేశ్ గౌడ్ మీదనో చేతబడి చేస్తే ఎదుర్కొంటాం : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | మాయగాళ్ల మాయలో పడకండి.. ప్రతి 6 నెలలకు ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Omar Abdullah | అదే జరిగిఉంటే.. పీవోకే ప్రజలు ఎప్పుడో జమ్ము కశ్మీర్‌లో కలిసిపోయేవారు : ఒమర్ అబ్దుల్లా
- ●Nagaur Drug Bust | నేవీ ఉద్యోగం వదిలేసి.. గూగుల్‌లో వెతికి ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన యువకుడు

OpenAI | చాట్ జీపీటీ ఇక మరింత వేగవంతం.. అప్‌గ్రేడ్ చేసిన ఓపెన్ ఏఐ..

Megastar | గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని అర్ధరాత్రి దారి తప్పిన మెగాస్టార్ - సాయం చేసిన అభిమాని

CM Revanth Reddy | నా మీదనో, మహేశ్ గౌడ్ మీదనో చేతబడి చేస్తే ఎదుర్కొంటాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | మాయగాళ్ల మాయలో పడకండి.. ప్రతి 6 నెలలకు ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి






