త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Colombia | కొలంబియాలో భారీ భూకంపం.. 132 మంది మృతి

Colombia | కొలంబియాను భూకంపం కుదిపేసింది. వంద‌లాది మందిని పొట్ట‌నపెట్టుకుంది.. ల‌క్ష‌లాది మందిని నిరాశ్ర‌యుల‌ను చేసింది. ప‌శ్చిమ కొలంబియాలో 7.4 తీవ్ర‌త‌తో సంభ‌వించిన భూకంపానికి 132 మంది మృతి చెంద‌గా, 500 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

S

International | Published On Aug 11, 2026, 8.12 am IST

Colombia | కొలంబియాలో భారీ భూకంపం.. 132 మంది మృతి
Advertisement

Colombia | త్రినేత్ర‌.న్యూస్ : కొలంబియాను భూకంపం కుదిపేసింది. వంద‌లాది మందిని పొట్ట‌నపెట్టుకుంది.. ల‌క్ష‌లాది మందిని నిరాశ్ర‌యుల‌ను చేసింది. ప‌శ్చిమ కొలంబియాలో 7.4 తీవ్ర‌త‌తో సంభ‌వించిన భూకంపానికి 132 మంది మృతి చెంద‌గా, 500 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ల‌క్ష‌లాది మంది తమ నివాసాల‌ను ఖాళీ చేసి.. సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లారు. సుమారు 80కి పైగా భ‌వ‌నాలు నేల‌మట్టం అయ్యాయి. ఈ శిథిలాల కింద వంద‌ల మంది చిక్కుకుపోయిన‌ట్లు విప‌త్తు నిర్వ‌హ‌ణ అధికారులు పేర్కొన్నారు.

దేశ రాజధాని బొగోటాకు 400 కిలోమీటర్ల దూరంలో చోకో ప్రాంతంలోని శాన్‌ జోస్‌ డెల్‌ పామార్‌ వద్ద ఈ భూకంప కేంద్ర స్థానం ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 107 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం జనించిందని అమెరికా జియలాజికల్‌ సర్వే సంస్థ వెల్లడించింది.

ఒక్క పెరిరా న‌గ‌రంలోనే 60 మంది దాకా చ‌నిపోయార‌ని న‌గ‌ర మేయ‌ర్ మౌరిసియో స‌లాజ‌ర్ మీడియాకు వెల్ల‌డించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితి అత్యంత దారుణంగా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. పెరిరా న‌గ‌రంలో ధ్వంస‌మైన భ‌వ‌నాల‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఏడు ఎయిర్‌పోర్టుల్లో విమానాల రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

Advertisement
Advertisement