Megastar | గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని అర్ధరాత్రి దారి తప్పిన మెగాస్టార్ – సాయం చేసిన అభిమాని
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తమిళనాడు నుంచి కేరళకు రోడ్డు మార్గంలో వెళ్లాలని ప్రయత్నించి దారితప్పిపోయాడు. గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని మోసపోయిన మమ్ముట్టికి ఓ అభిమాని అండగా నిలిచాడు. అతడికి దారి చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Aug 15, 2026, 5.54 pm IST
Megastar | అర్ధరాత్రి రెండు గంటల సమయం...గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని తెలియని ఏరియాలోని ప్రయాణించిన ఓ స్టార్ హీరో దారి తప్పిపోయాడు. గంటకుపైగా తిరిగినా సరైన గమ్యం కనిపించలేదు. అలాంటి టైమ్‌లోనే ఓ అభిమాని స్టార్ హీరోకు సాయంగా నిలిచాడు. సదరు అభిమాని మంచి మనసుకు హీరో ఫిదా అయ్యాడు. ఆ కథానాయకుడు మరెవరో కాదు మెగాస్టార్ మమ్ముట్టి. ప్రస్తుతం నిదీష్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు మమ్ముట్టి. ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని కరైకూడిలో జరుగుతోంది.
మలయాళ మూవీ షూటింగ్...
షూటింగ్ ముగించుకున్న ముమ్ముట్టి శుక్రవారం రాత్రి కరైకూడి నుంచి రోడ్డు మార్గంలో కేరళ బయలుదేరారు. మమ్ముట్టి వెంట మేనేజర్ జార్జ్‌తో పాటు ప్రొడ్యూసర్ ఆంటోనీ జోసెఫ్, యాక్టర్ కమ్ ఎమ్మెల్యే రమేష్ పిషారోడి కూడా కూడా ఉన్నారు.
గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని
కేరళకు సమీపంలో ఉండగా తిరుప్పూర్ దగ్గరలో వారు వెళ్లాల్సిన నేషనల్ హైవే మరమ్మత్తుల కారణంగా మూసివేశారు. గూగుల్ మ్యాన్స్ నమ్ముకొని మరో రూట్‌లో కేరళ వెళ్లాలని మమ్ముట్టి అతడి స్నేహితులు ప్రయత్నించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత గూగుల్ మ్యాప్స్ సరిగ్గా పనిచేయకపోవడంతో దారితప్పిపోయారు. దాదాపు గంట పాటు తిరిగినా నరైన రూటు కనిపించలేదు. దాంతో వెనక్కి వెళ్లిపోవాలని అనుకుంటున్న టైమ్‌లోనే పాండియన్ అనే అభిమాని మమ్ముట్టిని గుర్తుపట్టి అతడికి సాయం చేశాడు.
అభిమాని సాయం...
పాండియన్ తన బైక్‌పై ప్రయాణిస్తూ ముమ్ముట్టి కి దారి చూపించాడు. అతడి బైక్‌ను మమ్ముట్టి ఫాలో అయ్యాడు. దాదాపు పదిహేను కిలోమీటర్లు ప్రయాణించి వారికి సరైన రూట్‌కు తీసుకెళ్లాడు. పాండియన్ చేసిన సాయానికి మమ్ముట్టి కారు నుంచి దిగి అతడికి కృతజ్ఞత చెప్పాడు. అతడితో కలిసి ఫొటో దిగాడు. ఈ రోజు నుంచి నువ్వు నాకు స్నేహితుడివే అంటూ మమ్ముట్టి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమకు ఎదురైన అనుభవాన్ని యాక్టర్ రమేష్ పిషారోడి అభిమానులతో పంచుకున్నారు. పాండియన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
வழி காட்டிய பாண்டியனுக்கு #Mammootty கொடுத்த நெகிழ்ச்சியான பரிசு! 🫂❤️
நள்ளிரவில் சாலையில் சிக்கித் தவித்த மம்மூட்டிக்கு உதவிய பாண்டியன், தனது பைக்கில் முன்னால் சென்று கேரளா செல்லும் பாதையை காட்டியுள்ளார்.
அவருக்கு நன்றி கூறிய மம்மூட்டி, திடீரென காரிலிருந்து இறங்கி பாண்டியனை…
— Balaji (@RDBalaji) August 15, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ – సీన్ సీన్‌కో మలుపు
జులై 26, 2026

Sreeleela | శ్రీలీల, సాయిపల్లవి తమిళ మూవీ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే – రజనీకాంత్‌కు పోటీగా!
జులై 26, 2026

Mammootty | విలన్ పాత్రలతో బెస్ట్ యాక్టర్‌గా రెండు సార్లు నేషనల్ అవార్డ్ – మెగాస్టార్ రేర్ రికార్డ్
జులై 19, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | మాయగాళ్ల మాయలో పడకండి.. ప్రతి 6 నెలలకు ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Omar Abdullah | అదే జరిగిఉంటే.. పీవోకే ప్రజలు ఎప్పుడో జమ్ము కశ్మీర్లో కలిసిపోయేవారు : ఒమర్ అబ్దుల్లా
- ●Nagaur Drug Bust | నేవీ ఉద్యోగం వదిలేసి.. గూగుల్‌లో వెతికి ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన యువకుడు
- ●CM Revanth Reddy | ఈ సారి చిలుక పచ్చ చీరలు పంపిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Vishwanath And Sons | విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్స్ - సూర్య సినిమాకు తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్
- ●CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్

CM Revanth Reddy | మాయగాళ్ల మాయలో పడకండి.. ప్రతి 6 నెలలకు ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి

Omar Abdullah | అదే జరిగిఉంటే.. పీవోకే ప్రజలు ఎప్పుడో జమ్ము కశ్మీర్లో కలిసిపోయేవారు : ఒమర్ అబ్దుల్లా

Nagaur Drug Bust | నేవీ ఉద్యోగం వదిలేసి.. గూగుల్‌లో వెతికి ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన యువకుడు

CM Revanth Reddy | ఈ సారి చిలుక పచ్చ చీరలు పంపిస్తా : సీఎం రేవంత్ రెడ్డి



