CM Revanth Reddy | నా మీదనో, మహేశ్ గౌడ్ మీదనో చేతబడి చేస్తే ఎదుర్కొంటాం : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | చేతబడులపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నా మీదనో, మహేశ్ కుమార్ గౌడ్ మీదనో చేతబడి చేస్తే ఎదుర్కొంటాం.. కానీ నాలుగు కోట్ల ప్రజల మీద చేతబడి చేసుడేంది అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : చేతబడులపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నా మీదనో, మహేశ్ కుమార్ గౌడ్ మీదనో చేతబడి చేస్తే ఎదుర్కొంటాం.. కానీ నాలుగు కోట్ల ప్రజల మీద చేతబడి చేసుడేంది అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. సంగారెడ్డిలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చనిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, రాష్ట్రం అల్లకల్లోల్లం కావాలని, శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్థరాత్రి పూజలు చేశారు. ఇంత దుర్మార్గుడు ఎవడైనా ఉంటారా..? నా మీదనో, మహేశ్ కుమార్ గౌడ్ మీదనో చేతబడి చేస్తే మేం ఎట్లనో ఎదుర్కొంటాం. ప్రజల మీద చేతబడి చేసుడేంది. ఇలాంటోళ్లకు ప్రజాజీవితానికి అర్హత ఉందా..? ఇవాళ ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు.. మహేశ్‌కు నోటీసు అన్నడు.. నేను సూటిగా అడుగుతున్న మెదక్ గడ్డ మీద నుంచి. మీరు ఎక్కడికి పోయినా.. వెంటనే సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతారు కదా..? మరి శివమొగ్గలో పూజలు చేస్తే ఎందుకు ఫొటో పెట్టలేదు.. కర్ణాటక, తమిళనాడు పోయినట్టు ఎందుకు ప్రకటించలేదు.. ఎందుకు రహస్యంగా ఉంచినవ్. మేం తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట, రాజన్న, సమ్మక్క సారలమ్మ పోతే మీడియాకు ఫొటోలు పంపించాం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తాం. శివమొగ్గకు పోయి చెప్పలేదు.. పిల్లిమొగ్గలు ఎందుకు వేస్తున్నవ్. తమిళనాడులో ఏ గుడికి పోయావ్.. అఘోర పూజల వివరాలతో పాటు పూజారులు ఎవరో బయటపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
కృష్ణాలో నీళ్లు వచ్చాయంటే మా సంకల్పం గొప్పది..
చివరికి అధికారం కోసం ప్రజల మీద చేతబడి చేసి సంక్షోభం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నరు. ఎల్‌నినో వచ్చినప్పటికీ ఎల్లంపల్లి నిండి గోదావరి వరదలై పారుతుంది. కృష్ణాలో నీళ్లు వచ్చాయంటే మా సంకల్పం గొప్పది.. దైవ సంకల్పం తోడై రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిస్తున్నాం. దేవుడి ఆశీర్వాదంతో పాటు మీరందరూ అండగా నిలబడాలి. దేశంలోనే తెలంగాణను మొదటి రాష్ట్రంగా నిలబెడుతామని సీఎం తేల్చిచెప్పారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | మాయగాళ్ల మాయలో పడకండి.. ప్రతి 6 నెలలకు ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 15, 2026

CM Revanth Reddy | ఈ సారి చిలుక పచ్చ చీరలు పంపిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 15, 2026

CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | మాయగాళ్ల మాయలో పడకండి.. ప్రతి 6 నెలలకు ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Omar Abdullah | అదే జరిగిఉంటే.. పీవోకే ప్రజలు ఎప్పుడో జమ్ము కశ్మీర్లో కలిసిపోయేవారు : ఒమర్ అబ్దుల్లా
- ●Nagaur Drug Bust | నేవీ ఉద్యోగం వదిలేసి.. గూగుల్‌లో వెతికి ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన యువకుడు
- ●CM Revanth Reddy | ఈ సారి చిలుక పచ్చ చీరలు పంపిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Vishwanath And Sons | విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్స్ - సూర్య సినిమాకు తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్
- ●CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్

CM Revanth Reddy | మాయగాళ్ల మాయలో పడకండి.. ప్రతి 6 నెలలకు ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి

Omar Abdullah | అదే జరిగిఉంటే.. పీవోకే ప్రజలు ఎప్పుడో జమ్ము కశ్మీర్లో కలిసిపోయేవారు : ఒమర్ అబ్దుల్లా

Nagaur Drug Bust | నేవీ ఉద్యోగం వదిలేసి.. గూగుల్‌లో వెతికి ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన యువకుడు

CM Revanth Reddy | ఈ సారి చిలుక పచ్చ చీరలు పంపిస్తా : సీఎం రేవంత్ రెడ్డి



