CM Revanth Reddy | మాయగాళ్ల మాయలో పడకండి.. ప్రతి 6 నెలలకు ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | మాయగాళ్ల మాయలో పడకండి.. వారి మాటలు వినకండి.. ఇక నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పోటీ పరీక్షలు నిర్వహిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏ ఉద్యోగ ఖాళీలను కూడా గాలికి వదిలేయనని రేవంత్ స్పష్టం చేశారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : మాయగాళ్ల మాయలో పడకండి.. వారి మాటలు వినకండి.. ఇక నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పోటీ పరీక్షలు నిర్వహిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏ ఉద్యోగ ఖాళీలను కూడా గాలికి వదిలేయనని రేవంత్ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ నిరుద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కోసం జరిగింది.. కానీ కేసీఆర్ ఇంటినిండా ఉద్యోగాలు తీసుకున్నారు. చుట్టాలను మంత్రులను చేశారు. వారంతా కోట్లు సంపాదించారు. మన పిల్లలకు నౌకరీ ఇవ్వలేదు. బిడ్డను ఓడిస్తే ఉద్యోగం ఇచ్చిండు.. మనకు మాత్రం నోటిఫికేషన్ల ఇచ్చి ప్రశ్నపత్రాలు అమ్ముకున్నడు. మేం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 70 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టినం. ఇందులో 10 వేల మంది నర్సులకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకో పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినం. జాగ్రత్తగా చదివి పోటీ పరీక్షలకు ప్రిపేరవ్వండి. పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి కూడా పెంచినం.. భవిష్యత్ ఖాళీలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఆరు నెలలకు పోటీ పరీక్షలు నిర్వహిస్తా. ఏ ఖాళీలను కూడా గాలికి వదిలేయను. నియామకాలు చేపట్టి పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తా. కొందరు వచ్చి మాయమాటలు చెబితే నిరుద్యోగులు రెచ్చిపోవద్దు అని సీఎం రేవంత్ సూచించారు.
మాటిస్తే మట్టిలో కలిసే వరకు మాట కోసం నిలబడుతా
ఉద్యమ సమయంలో విద్యార్థులను రెచ్చగొట్టి వారి ప్రాణాలు తీశారు.. కోల్పోయిన అధికారాన్ని సాధించాలంటే పిల్లలను రెచ్చగొట్టాలి.. వారు శవాలుగా మారాలి. ఆ శవాలను పునాదులుగా చేసుకుని మళ్లీ అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నరు.. పెట్టుబడులు పెడుతున్నరు. నేను మీ రేవంత్ అన్నగా చెబుతున్నా మాటిస్తున్న.. మాటిస్తే మట్టిలో కలిసే వరకు మాట కోసం నిలబడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. సోనియా, రాహుల్ నాయకత్వంలో నేను, మహేశ్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పని చేస్తున్నాం.. మీకు ఉద్యోగాలిచ్చే బాధ్యత మాది.. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది. వారు మాయగాళ్లు.. వారి మాయలో పడకండి.. మాయలేడి మాదిరి మభ్య పెడుతారు. మభ్యపెట్టి మన ప్రాణాలను అధికారం కోసం వాడుకునేందుకు కుట్రలు చేస్తున్నరు. పోటీ పరీక్షలకు ప్రిపేరవ్వండి.. నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత నాది అని సీఎం నిరుద్యోగ అభ్యర్థులకు సూచించారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ఈ సారి చిలుక పచ్చ చీరలు పంపిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 15, 2026

CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్కు రేవంత్ సవాల్
ఆగస్టు 15, 2026

CM Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. నాణెనికి బొమ్మ, బొరుసు లాంటి వారు : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●Nagaur Drug Bust | నేవీ ఉద్యోగం వదిలేసి.. గూగుల్లో వెతికి ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన యువకుడు
- ●CM Revanth Reddy | ఈ సారి చిలుక పచ్చ చీరలు పంపిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Vishwanath And Sons | విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్స్ - సూర్య సినిమాకు తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్
- ●CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్కు రేవంత్ సవాల్
- ●Mahindra BE 6 | మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్.. ఫార్ములా ఈ-రేసింగ్ స్ఫూర్తితో కొత్త ఎడిషన్..
- ●CM Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. నాణెనికి బొమ్మ, బొరుసు లాంటి వారు : సీఎం రేవంత్ రెడ్డి

Nagaur Drug Bust | నేవీ ఉద్యోగం వదిలేసి.. గూగుల్లో వెతికి ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన యువకుడు

CM Revanth Reddy | ఈ సారి చిలుక పచ్చ చీరలు పంపిస్తా : సీఎం రేవంత్ రెడ్డి

Vishwanath And Sons | విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్స్ - సూర్య సినిమాకు తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్

CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్కు రేవంత్ సవాల్



