OpenAI | చాట్ జీపీటీ ఇక మరింత వేగవంతం.. అప్‌గ్రేడ్ చేసిన ఓపెన్ ఏఐ..
OpenAI | ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ సంస్థ ఓపెన్ ఏఐ తన నూతన వేగవంతమైన మోడల్‌ను లాంచ్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న ఏఐ మోడల్స్ కన్నా 14 రెట్లు ఎక్కువ వేగంతో పనిచేసే మోడల్‌ను లాంచ్ చేసినట్లు తెలిపింది. జీపీటీ-5.6 సోల్ పేరిట ఈ ఏఐ మోడల్‌ను ఓపెన్ ఏఐ లాంచ్ చేసింది. దీనికిగాను కొత్తగా అల్ట్రాఫాస్ట్ సర్వీస్ టియర్‌ను ఆ సంస్థ ప్రవేశపెట్టింది.
Technology | Published On Aug 15, 2026, 5.59 pm IST
OpenAI | ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ సంస్థ ఓపెన్ ఏఐ తన నూతన వేగవంతమైన మోడల్‌ను లాంచ్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న ఏఐ మోడల్స్ కన్నా 14 రెట్లు ఎక్కువ వేగంతో పనిచేసే మోడల్‌ను లాంచ్ చేసినట్లు తెలిపింది. జీపీటీ-5.6 సోల్ పేరిట ఈ ఏఐ మోడల్‌ను ఓపెన్ ఏఐ లాంచ్ చేసింది. దీనికిగాను కొత్తగా అల్ట్రాఫాస్ట్ సర్వీస్ టియర్‌ను ఆ సంస్థ ప్రవేశపెట్టింది. మొదట ఓపెన్ ఏఐ ద్వారా ఏపీఐ వాడుతున్న యూజర్లకు ఇది అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ తెలిపింది. తరువాత దశలవారీగా యూజర్లందరికీ దీన్ని అందించనున్నట్లు తెలియజేసింది.
తక్కువ లేటెన్సీ.. సెకన్‌కు 750 అవుట్‌పుట్ టోకెన్లు..
తక్కువ లేటెన్సీతో ఈ కొత్త ఏఐ మోడల్ పనిచేస్తుందని ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది. దీని వల్ల మోడల్ చాలా వేగంగా సమాధానాలు ఇస్తుందని, అలాగే సెకన్‌కు 750 వరకు అవుట్‌పుట్ టోకెన్లను ఉత్పత్తి చేస్తుందని తెలిపింది. జీపీటీ 5.6 కు పలు అప్‌గ్రేడ్స్ చేసి దీన్ని లాంచ్ చేసింది. దీంతో తమ స్టాక్ అంతటా సామర్థ్యం పెరిగిందని ఓపెన్ఏఐ వెల్లడించింది. ఇక వేగంగా ప్రతిస్పందనలు అవసరం అయ్యే వర్క్‌ఫ్లోల కోసం ఈ మోడల్‌ను అల్ట్రాఫాస్ట్ టియర్‌లో పరీక్షిస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. ఇప్పటి వరకు రియల్‌టైం ఏఐ ప్రతిస్పందనలు అవసరం అయ్యే అప్లికేషన్‌లు తరచూ ప్రత్యేకమైన ఏఐ మోడల్స్‌పై ఆధారపడేవి. అయితే ఓపెన్ఏఐ లాంచ్ చేసిన ఈ మోడల్ ద్వారా పని మరింత సులభతరం కానుంది.
రియల్‌టైంలో సమాధానాలు..
యూజర్లకు ఈ మోడల్ రియల్‌టైమ్‌లో ప్రతిస్పందనలను ఇస్తుంది. దీని వల్ల చాలా వరకు ఆలస్యాన్ని నివారించవచ్చు. అలాగే స్టాక్ మార్కెట్లను విశ్లేషించడం, లావాదేవీలను అంచనా వేయడం, అనుమానాస్పద లావాదేవీలు లేదా కార్యకలాపాలను గుర్తించడంలో వేగంగా పనిచేస్తుంది. కస్టమర్లకు సపోర్ట్ అందించేందుకు కూడా ఈ మోడల్ రియల్‌టైంలో పనిచేస్తుంది. దీంతో యూజర్లకు అవసరమైన సహాయం త్వరగా లభిస్తుంది. ఏఐ మోడల్ సమాధానం ఇచ్చే వరకు వేచి ఉండాల్సిన పని లేదు. రియల్‌టైమ్‌లో సమాధానాలను పొందవచ్చు. అలాగే కావల్సిన సమయాల్లో ఈ మోడల్‌ను రన్ చేసుకునేలా సదుపాయం ఇచ్చారు. ఇక ఈ జీపీటీ-5.6 సోల్ ఏఐ మోడల్ ప్రస్తుతం కొద్ది మంది ఎంపిక చేసిన ఓపెన్ఏఐ కస్టమర్లకు ఇన్విటేషన్ ప్రాతిపదికన అందుబాటులో ఉంది. వినియోగదారులు తమకు లభిస్తుందో, లేదో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లి పరిశీలించవచ్చు. కానీ అతి త్వరలోనే దీన్ని యూజర్లందరికీ అధికారికంగా అందుబాటులోకి తెస్తామని ఓపెన్ఏఐ తెలిపింది.
సంబంధిత వార్తలు

WhatsApp | స్కామర్లకు ఇక చెక్.. వాట్సాప్‌లో ఏఐతో కొత్త సెక్యూరిటీ ఫీచర్..
ఆగస్టు 14, 2026

SpaceXAI | స్పేస్ఎక్స్ఏఐ నుంచి గ్రోక్ బాట్.. ఇక పనులన్నింటినీ ఏఐ ఏజెంట్లే చేస్తాయి..
ఆగస్టు 12, 2026

Cyber Crime | సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు తొందరగా న్యాయం అందించాలి: అదనపు సీపీ ఎం.శ్రీనివాస్
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | మాయగాళ్ల మాయలో పడకండి.. ప్రతి 6 నెలలకు ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Omar Abdullah | అదే జరిగిఉంటే.. పీవోకే ప్రజలు ఎప్పుడో జమ్ము కశ్మీర్లో కలిసిపోయేవారు : ఒమర్ అబ్దుల్లా
- ●Nagaur Drug Bust | నేవీ ఉద్యోగం వదిలేసి.. గూగుల్‌లో వెతికి ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన యువకుడు
- ●CM Revanth Reddy | ఈ సారి చిలుక పచ్చ చీరలు పంపిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
- ●Vishwanath And Sons | విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్స్ - సూర్య సినిమాకు తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్
- ●CM Revanth Reddy | రైతులకు మేలు చేసిందేవరో చర్చిద్దాం రా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్

CM Revanth Reddy | మాయగాళ్ల మాయలో పడకండి.. ప్రతి 6 నెలలకు ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి

Omar Abdullah | అదే జరిగిఉంటే.. పీవోకే ప్రజలు ఎప్పుడో జమ్ము కశ్మీర్లో కలిసిపోయేవారు : ఒమర్ అబ్దుల్లా

Nagaur Drug Bust | నేవీ ఉద్యోగం వదిలేసి.. గూగుల్‌లో వెతికి ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన యువకుడు

CM Revanth Reddy | ఈ సారి చిలుక పచ్చ చీరలు పంపిస్తా : సీఎం రేవంత్ రెడ్డి



