త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earthquake | ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Earthquake | ఇండోనేషియాలో (Indonesia) భారీ భూకంపం (Earthquake) వ‌చ్చింది. శనివారం తెల్లవారుజామున ఫ్లోరెస్‌ ద్వీపం (Flores Island) స‌మీపంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.7గా నమోదైంది.

G

International | Published On Aug 15, 2026, 7.23 am IST

Earthquake | ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Advertisement

Earthquake | త్రినేత్ర‌.న్యూస్‌: ఇండోనేషియాలో (Indonesia) భారీ భూకంపం (Earthquake) వ‌చ్చింది. శనివారం తెల్లవారుజామున ఫ్లోరెస్‌ ద్వీపం (Flores Island) స‌మీపంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.7గా నమోదైంది. ఎండే నగరానికి 68 కిలోమీట‌ర్ల‌ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్న‌ట్లు నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS), ఇండోనేషియా మెటీయోల‌జీ, క్లైమెటాల‌జీ అండ్ జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) వెల్ల‌డించింది.

అంత‌కుముందు కొద్దిసేపటి క్రితమే అదే ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూమి కంపించింద‌ని చెప్పారు. దీంతో వరుసగా రెండుసార్లు భూకంపం రావ‌డం, తీవ్రత కూడా అధికంగా ఉండటంతో సునామీ హెచ్చరికలు (Tsunami warning) జారీ చేశారు. తీర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లిపోవాలని ప్రజలను ఆదేశించారు. 0.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడే అవకాశముందని హెచ్చరించారు.

కాగా, భూకంపం ధాటికి భ‌వ‌నాలు ఊగిపోయాయి. దీంతో ద‌వాఖాన‌ల్లోని రోగులు బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. అనేక‌చోట్ల గోడ‌లు ప‌గుళ్లు వ‌చ్చాయ‌ని స్థానికులు తెలిపారు. భూకంపం స‌ముద్ర గ‌ర్భంలో సంభ‌వించ‌డంతో ఇండోనేషియా మైదాన ప్రాంతాల్లో దీని ప్ర‌భావం ఎంత‌వ‌ర‌కు ఉంద‌నేది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

2004లో 9.1 తీవ్ర‌త‌తో సుమ‌త్ర (Sumatra) తీరంలో వ‌చ్చిన భారీ భూకంపం వచ్చింది. దీంతో ఇండోనేషియాలో 1.70 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. 2018లో లొమ్‌బోక్ దీవిలో భారీ భూకంపం వ‌చ్చింది. వ‌రుస‌గా రెండు వారాల‌పాటు భూమికంపించింది. ఈ నేప‌థ్యంలో హాలిడే ద్వీపం, దాని స‌మీపంలోని సుంబావా ద్వీపంలో 550 మందికిపైగా మృతిచెందారు.

Advertisement
Advertisement