Indians Recruited In Russian Army | రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి.. వెల్లడించిన కేంద్రం
Indians Recruited In Russian Army | రష్యా ఆర్మీలోకి 227 మంది భారతీయులు చేరగా (Indians Recruited In Russian Army).. వారిలో 51 మంది మరణించినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.
Indians Recruited In Russian Army | త్రినేత్ర.న్యూస్ : రష్యా సాయుధ దళాల్లోకి 227 మంది భారతీయులు చేరినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) తెలిపారు. వారిలో 139 మంది విడుదలకాగా, 51 మంది మరణించినట్లు చెప్పారు. మిగతా వారిని రష్యా సైనం నుంచి విడుదల చేసి వారిని స్వదేశానికి రప్పించేందుకు మాస్కోతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్రీఫింగ్‌లో.. రష్యా సైన్యంలో సేవలందిస్తున్న భారతీయులపై ఏఎన్ఐ అడిగిన ప్రశ్నకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సమాధానమిచ్చారు. "రష్యా సైన్యంలోకి 227 మంది భారతీయులు చేరారు. ఇప్పటి వరకూ 139 మంది విడుదలయ్యారు. 51 మంది మరణించినట్లు మాకు సమాచారం ఉంది. మిగతావారిని విడుదల చేసే అంశంపై మాస్కోతో న్యూఢిల్లీ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఈ అంశంపై భారత్-రష్యా మధ్య వివిధ స్థాయిల్లో, పలు సందర్భాల్లో చర్చ జరిగింది" అని విక్రమ్ మిస్రీ వెల్లడించారు.
Also Read..
విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య.. ప్రయాణికుల్లో టెన్షన్
వాణిజ్య సిలిండర్‌పై మళ్లీ బాదుడు.. సీఎన్‌జీ, జెట్ ఇంధన ధరలూ పెంపు
ఆగస్టు 31 నాటికి 7.8 కోట్లకు పైగా ఐటీఆర్‌లు.. కొత్త రికార్డు..
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి






