Indian Couple | మీ ఇండియాకు వెళ్లిపోండి.. అమెరికాలో భారతీయ జంటకు అవమానం..వీడియో
ndian Couple | అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వీసాలు, డీపోర్టేషన్, ఇమ్మిగ్రేషన్ పేరుతో భారతీయ ఉద్యోగులు, విద్యార్థులను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. పాలకుడి అడుగు జాడల్లో అక్కడి ప్రజలూ నడుస్తున్నారు. భారతీయ (Indians) పౌరలను మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నారు.
International | Published On May 28, 2026, 7.58 am IST
Indian Couple | త్రినేత్ర.న్యూస్: అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వీసాలు, డీపోర్టేషన్, ఇమ్మిగ్రేషన్ పేరుతో భారతీయ ఉద్యోగులు, విద్యార్థులను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. పాలకుడి అడుగు జాడల్లో అక్కడి ప్రజలూ నడుస్తున్నారు. భారతీయ (Indians) పౌరలను మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నారు. ప్రతీరోజూ ఏదో ఒక చోట జాత్యాహంకార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. తాజాగా ఓ భారతీయ జంటను (Indian Couple) ఇక్కడికి ఎందుకు వచ్చారు.. మీ దేశానికి వెళ్లిపోండి అంటూ అవమానించాడో అమెరికన్. మాకు మీలాంటి వాళ్లు అవసరం లేదు అంటూ దురుసుగా ప్రవర్తించాడు.
ఓ భారతీయ జంట వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నది. తమకు నచ్చిన ప్రదేశాలను ఫోన్లలో ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కారులో ఆ జంట వద్దకు వచ్చిన ఓ వ్యక్తి.. మీరు ఇండియా నుంచి వచ్చారా? అని వారిని ప్రశ్నించాడు. దానికి వారు అవును అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత `మీకు ఇండియా ఇష్టమా? అమెరికా ఇష్టమా?` అని మరో ప్రశ్న అడిగాడు. `రెండూ ఇష్టమే. ఇండియాలో కుటుంబం ఉంటుంది` అని వాళ్లు చెప్పారు. `అయితే అక్కడికే వెళ్లిపోండి, ఇక్కడికెందుకు వచ్చారు` అంటూ బూతులు తిట్టాడు.
`భారతదేశం ఎంత అద్భుతమైనది! మీరెందుకు ఇక్కడ. భారతదేశంలోనే ఉండిపోవచ్చు కదా? అసలు మీరు అమెరికాకు ఎందుకు రావాలి?` అని అన్నాడు. ప్రతిగా `తాము ప్రపంచం అంతా చూడాలనుకుంటున్నాం` అని ఆ దంపతులు బదులిచ్చారు. దీంతో `నో, మీరు ఇక్కడ ఉండొద్దు. మీ ఇంటికి మీరు వెళ్లిపోవాలి. సరేనా! నా దేశం నుంచి బయటకు వెళ్లపోండి` అంటూ దురుసుగా మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నది. అమెరికన్ల జాత్యహంకారంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'ఇండియాకు వెళ్లిపోండి'.. అమెరికాలో భారతీయులకు అవమానం
అమెరికాలో భారతీయులకు అవమానం జరిగిన వీడియో SMలో వైరల్గా మారింది. ఓ జంట రోడ్డుపై నిలబడి ఫొటోలు తీసుకుంటుండగా ఓ వ్యక్తి 'మీరు ఇండియా నుంచి వచ్చారా?' అని అడిగాడు. వాళ్లు 'అవును' అని సమాధానమివ్వగా.. 'మీకు ఇండియా ఇష్టమా? అమెరికా… pic.twitter.com/j4244i4yv4
— ChotaNews App (@ChotaNewsApp) May 28, 2026
సంబంధిత వార్తలు

Indians Recruited In Russian Army | రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి.. వెల్లడించిన కేంద్రం
సెప్టెంబర్ 1, 2026

Medicine Prices | అమెరికన్లకు భారీ ఊరట.. తగ్గనున్న ఔషధాల ధరలు..
సెప్టెంబర్ 1, 2026

Donald Trump | వెనెజువెలాతో చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. ట్రంప్ కీలక ప్రకటన
ఆగస్టు 29, 2026
తాజావార్తలు
- ●MLA Prashanth Reddy | కాంగ్రెస్తో మంతనాలు చేయలేదని లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఉండి చెబుతున్నా.. కవిత చెప్పగలరా?
- ●PM Modi | ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక సంపదగా మారకూడదు.. ప్రపంచానికి ప్రధాని మోదీ గట్టి సందేశం
- ●GST Collection | పండగ జోష్తో ఆర్థిక వ్యవస్థకు ఊపు
- ●ఎక్స్క్లూజివ్: సీఎం ₹11 వేల కోట్లు ఇచ్చామన్నారు.. ఆర్టీసీ ఎండీ లేఖలో మాత్రం ₹2,607 కోట్లు బకాయి!
- ●H1N1 | కొన్ని నగరాల్లో భారీగా హెచ్1ఎన్1 కేసులు, కొన్ని చోట్ల స్వల్పంగా.. ఎందుకీ తేడా..?
- ●Telangana Political Survey 2026 | కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై సర్వే: షాకింగ్ రిపోర్ట్

MLA Prashanth Reddy | కాంగ్రెస్తో మంతనాలు చేయలేదని లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఉండి చెబుతున్నా.. కవిత చెప్పగలరా?

PM Modi | ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక సంపదగా మారకూడదు.. ప్రపంచానికి ప్రధాని మోదీ గట్టి సందేశం

GST Collection | పండగ జోష్తో ఆర్థిక వ్యవస్థకు ఊపు

ఎక్స్క్లూజివ్: సీఎం ₹11 వేల కోట్లు ఇచ్చామన్నారు.. ఆర్టీసీ ఎండీ లేఖలో మాత్రం ₹2,607 కోట్లు బకాయి!



