ITR | ఆగస్టు 31 నాటికి 7.8 కోట్లకు పైగా ఐటీఆర్‌లు.. కొత్త రికార్డు..
ITR | ఆదాయపు పన్ను శాఖ తెలిపిన వివరాల ప్రకారం 2026-27 అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై)కు సంబంధించి ఆగస్టు 31 నాటికి రికార్డు స్థాయిలో 7.8 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌లు) దాఖలయ్యాయి. గతేడాది 2025-26 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి సెప్టెంబర్ 16, 2025 వరకు 7.3 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి.
ITR | ఆదాయపు పన్ను శాఖ తెలిపిన వివరాల ప్రకారం 2026-27 అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై)కు సంబంధించి ఆగస్టు 31 నాటికి రికార్డు స్థాయిలో 7.8 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌లు) దాఖలయ్యాయి. గతేడాది 2025-26 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి సెప్టెంబర్ 16, 2025 వరకు 7.3 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. నాన్-ఆడిట్ కేసులకు రిటర్నులు దాఖలు చేసేందుకు గతేడాది గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించారు. 2026--7 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఆగస్టు 31 నాటికి రికార్డు స్థాయిలో 7.8 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ మంగళవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇందులో జూలై 31న ఉన్న గడువు తేదీలోగా దాఖలైన ఐటీఆర్-1, ఐటీఆర్-2లు 5.9 కోట్లకు పైగా ఉన్నాయి. సాధారణంగా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, నిర్దిష్ట వర్గాలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ఈ రెండు ఫామ్‌లను వినియోగిస్తారు.
ఏయే ఫామ్‌లు ఎవరికి..
వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందుతూ, ఆడిట్ పరిధిలోకి రాని పన్ను చెల్లింపుదారులకు ఆగస్టు 31 ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు. నాన్-ఆడిట్ కేటగిరీలోకి వచ్చే వారు తమకు వర్తించే ఐటీఆర్-3, ఐటీఆర్-4, ఐటీఆర్-5 లేదా ఐటీఆర్-7 ఫామ్‌లను దాఖలు చేయవచ్చు. ప్రొప్రైటరీ వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) ఐటీఆర్-3ని దాఖలు చేస్తారు. చిన్న, మధ్యస్థ స్థాయి పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్-4 సరళమైన రిటర్న్ ఫామ్‌గా ఉంటుంది. సంస్థలు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌లు, సహకార సంఘాలు ఐటీఆర్-5ను దాఖలు చేస్తాయి. కంపెనీల చట్టం కింద నమోదైన కంపెనీలు ఐటీఆర్-6ను దాఖలు చేస్తాయి. ట్రస్టులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ధార్మిక సంస్థలు ఐటీఆర్-7ను దాఖలు చేస్తాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి






