త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mango Tree | అద్భుతం.. ఒకే చెట్టుకు 14 ర‌కాల మామిడి పండ్లు..!

Mango Tree | ఓ రైతు అద్భుతం సృష్టించాడు. ఒకే చెట్టుకు 14 ర‌కాల పండ్లు పండించి.. రైతులతో పాటు వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌ల దృష్టిని ఆక‌ర్షించాడు. మ‌రి ఒకే చెట్టుకు 14 ర‌కాల పండ్లు పండిచ‌డం సాధ్యం కాదు.. కానీ ఈ రైతు అంటుక‌ట్టే విధానాన్ని ప్ర‌యోగించి స‌ఫ‌లీకృతుడ‌య్యాడు.

S

National | Published On May 11, 2026, 7.29 am IST

Mango Tree | అద్భుతం.. ఒకే చెట్టుకు 14 ర‌కాల మామిడి పండ్లు..!
Advertisement

Mango Tree | ఓ రైతు అద్భుతం సృష్టించాడు. ఒకే చెట్టుకు 14 ర‌కాల పండ్లు పండించి.. రైతులతో పాటు వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌ల దృష్టిని ఆక‌ర్షించాడు. మ‌రి ఒకే చెట్టుకు 14 ర‌కాల పండ్లు పండిచ‌డం సాధ్యం కాదు.. కానీ ఈ రైతు అంటుక‌ట్టే విధానాన్ని ప్ర‌యోగించి స‌ఫ‌లీకృతుడ‌య్యాడు.

గుజ‌రాత్ అమ్రేలీ జిల్లా గిర్ కేస‌ర్ మామిడి పండ్ల‌కు ప్ర‌సిద్ధి. దిటాలా గ్రామానికి చెందిన రైతు ఉకాభాయ్ భ‌ట్టి.. స‌రికొత్త ప్ర‌యోగానికి పూనుకున్నాడు. ఒకే మామిడి చెట్టుకు 14 ర‌కాల మామిడి మొక్క‌ల‌కు సంబంధించిన కొమ్మ‌ల‌ను అంటుక‌ట్టాడు. ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతమై చెట్టు ఏపుగా పెరిగింది.

శాస్త్రీయ ప‌ద్ధ‌తుల్లో అంటుక‌ట్టాడు. మొత్తానికి ఈ చెట్టుకు ఇప్పుడు 14 ర‌కాల పండ్లు కాస్తున్నాయి. కేస‌ర్, అమ్ర‌పాలి, లంగ్రా, బాదామి, గులాబీ, ర‌స్‌బారీ, జమాదార్, కాలా జ‌మాదార్, హ‌పుల్, తోత‌పురి వంటి ర‌కాలు పండించారు. ఇవ‌న్నీ కూడా అద్భుత‌మైన రుచిని క‌లిగి ఉన్నాయి. ప్ర‌స్తుతం త‌న చెట్టు ర‌క‌ర‌కాల మామిడి పండ్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌ని రైతు ఉకాభాయ్ తెలిపాడు. త‌న ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంతో గ‌ర్వంగా ఉంద‌న్నాడు.

Advertisement
Advertisement