త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Day Care | మూడేళ్ల చిన్నారిని కుర్చీకి క‌ట్టేసి.. ఢిల్లీ డే కేర్‌లో దారుణం

Delhi Day Care | దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఓ డేకేర్ సెంట‌ర్ (Delhi Day Care)లో మూడేళ్ల బాలుడిపై దాడి జ‌రిగింది. చిన్నారిని కుర్చీకి క‌ట్టేసి దారుణంగా కొట్టిన వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ దాడిలో చిన్నారి రెండు చెవుల క‌ర్ణ‌భేరిలు తీవ్రంగా వాచిపోయిన‌ట్లు వైద్యులు గుర్తించారు.

D

National | Published On Aug 31, 2026, 2.46 pm IST

Delhi Day Care | మూడేళ్ల చిన్నారిని కుర్చీకి క‌ట్టేసి.. ఢిల్లీ డే కేర్‌లో దారుణం
Advertisement

Delhi Day Care | త్రినేత్ర‌.న్యూస్ : బెంగ‌ళూరులోని క్యాప్‌జెమినీ (Capgemini) క్యాంపస్‌లోని డేకేర్ సెంటర్‌లో చిన్నారుల‌పై అక్క‌డి సిబ్బంది దాడి చేసిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే దేశ రాజ‌ధాని ఢిల్లీలో (Delhi Day Care) అదే త‌ర‌హా ఘ‌ట‌న వెలుగు చూసింది. మూడేళ్ల చిన్నారిని కుర్చీకి క‌ట్టేసి దారుణంగా కొట్టిన వీడియో వైర‌ల్ అవుతోంది.

ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్ ప్రాంతంలో (Maujpur area) ఈ దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది. అక్క‌డి ఓ ప్రైవేట్ డేకేర్‌, ప్లే స్కూల్‌లో మూడేళ్ల బాలుడిపై సిబ్బంది అమానుషానికి పాల్ప‌డ్డారు. చిన్నారిని గంట‌ల త‌ర‌బ‌డి కుర్చీకి క‌ట్టేసి దారుణంగా కొట్టారు. ఈ దాడిలో చిన్నారి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈనెల 18న‌ చిన్నారి తీవ్ర‌మైన గాయాల‌తో ఇంటికి వెళ్లాడు. బాబు క‌ళ్లు, చెవులు వాచిపోయి ఉన్నాయి. అంతేకాదు వాంతులు కూడా చేసుకున్నాడు. చిన్నారి ప‌రిస్థితిని చూసిన త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌నకు గుర‌య్యారు. వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

చిన్నారిని ప‌రీక్షించిన వైద్యులు రెండు చెవుల క‌ర్ణ‌భేరిలు తీవ్రంగా వాచిపోయిన‌ట్లు గుర్తించారు. శారీర‌క దాడి కార‌ణంగానే ఈ గాయాలై ఉండొచ్చ‌ని అనుమానించారు. వైద్యుల మాట‌ల‌కు షాకైన చిన్నారి తండ్రి అస‌లు ఏం జ‌రిగిందో తెలుసుకునేందుకు ప్లే స్కూల్‌కి వెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై అక్క‌డి ఉపాధ్యాయులు, సిబ్బందిని నిల‌దీయ‌గా త‌మ‌కు ఏమీ తెలియ‌న‌ది వాళ్లు బుకాయించారు. సీసీటీవీ ఫుటేజీ చూపించాల‌ని కోర‌గా స్కూల్ యాజ‌మాన్యం అందుకు నిరాక‌రించింది. చివ‌రికి రూ.1,500 తీసుకొని వీడియో చూపించింది. ఆగ‌స్టు 16, 17, 18 తేదీల్లోని వీడియోల‌ను ప‌రిశీలించ‌గా.. షాకింగ్ నిజం బ‌య‌ట‌ప‌డింది.

చిన్నారిని గంట‌ల త‌ర‌బ‌డి కుర్చీకి క‌ట్టేసిన‌ట్లు తేలింది. అంతేకాదు విచ‌క్ష‌ణార‌హితంగా బాలుడిని కొట్టిన‌ట్లు వీడియోలో క‌నిపించింది. కేర్‌టేక‌ర్‌, టీచ‌ర్‌ బాలుడిని ప‌దేప‌దే చెంప దెబ్బ‌లు కొట్ట‌డం, చెవులు ప‌ట్టుకుని లాగ‌డం, నేల‌పై కాళ్ల‌తో త‌న్న‌డం, ఈడ్చుకెళ్ల‌డం వంటి అఘాయిత్యాల‌కు పాల్ప‌డిన‌ట్లు తేలింది. దీంతో బాలుడి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేర‌కు పాఠ‌శాల యాజ‌మాన్యంపై పోలీసులు ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఓ ఆయాను అదుపులోకి తీసుకున్నారు. స్కూల్‌తో సంబంధం ఉన్న ఉపాధ్యాయురాలితో సహా ఇతర వ్యక్తుల ప్రమేయంపై కూడా విచారణ జరుపుతున్నారు.

వాషింగ్ మెషీన్‌లో వేసి..

కాగా, ఇటీవ‌లే బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ (Brookefield) ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ (Capgemini) క్యాంపస్‌లోని డేకేర్ సెంటర్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసిన విష‌యం తెలిసిందే. రెండేళ్ల పసిపిల్లలని కూడా చూడకుండా వారిపై డేకేర్ సిబ్బంది పైశాచికత్వానికి ఒడిగట్టారు. 2-3 ఏళ్ల వయసున్న చిన్నారులను ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్‌లో వేయడం, టాయిలెట్ జెట్‌లతో వారి ముఖంపై నీళ్లు కొట్టడం, బాత్‌రూమ్‌లలో బంధించి భయపెట్టడం వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియోలు కూడా వెలుగులోకి వ‌చ్చాయి. ఈ ఘటనకు సంబంధించి డేకేర్ సెంటర్‌లో ఆయాలుగా (Nannies) పనిచేస్తున్న ఐదుగురు మహిళల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ (JJ Act), భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 351 కింద వారిపై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు అదే త‌ర‌హా ఘ‌ట‌న వెలుగు చూడ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Also Read..

ఢిల్లీ ఓట‌ర్ల‌ జాబితా నుంచి 47.7 ల‌క్ష‌ల పేర్లు తొల‌గింపు

కాంగ్రెస్ శ్రేణులారా.. వెయ్యి రోజుల పాల‌న‌పై బీఆర్ఎస్‌కు ధీటైన జ‌వాబిద్దాం

అభివృద్ధిలో ఆద‌ర్శంగా క‌రీంన‌గ‌ర్‌ : బండి సంజయ్‌

Advertisement
Advertisement