Bandi Sanjay | అభివృద్ధిలో ఆదర్శంగా కరీంనగర్
Bandi Sanjay | కరీంనగర్ నగరాన్ని అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాల్లోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. నగర శివారు ప్రాంతాల్లో గల్లీగల్లీకీ కొత్త రోడ్లు, డ్రెయిన్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు.
- కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు
- రూ.630 కోట్ల యూసీఎఫ్ నిధులతో మోడల్ రోడ్లు
- ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, స్కై వాక్, జంక్షన్ల అభివృద్ధి
- రూ.130 కోట్లతో 80 కిమీల పొడవునా వాటర్ డ్రెయిన్స్
- 130 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తాం
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
Bandi Sanjay | కరీంనగర్ నగరాన్ని అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాల్లోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. నగర శివారు ప్రాంతాల్లో గల్లీగల్లీకీ కొత్త రోడ్లు, డ్రెయిన్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ 45వ డివిజన్ మంకమ్మతోటలోని ఎమ్మెల్సీ గోపాల్‌రావు భవనం సమీపంలో రూ.70 లక్షల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టనున్న డ్రెయిన్ పైప్‌లైన్, సీసీ రోడ్డు పనులకు సోమవారం బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
రూ.50కోట్ల యూఐడీఎఫ్ నిధులు
బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఇప్పటికే రూ.50 కోట్ల యూఐడీఎఫ్ నిధులు తీసుకొచ్చామని, మరో రూ.30 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర పెద్దలను ఒప్పించి కరీంనగర్‌ను యూసీఎఫ్ జాబితాలో చేర్పించి రూ.840 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు చెప్పారు. వీటితో నగర రూపురేఖలను మార్చనున్నట్లు పేర్కొన్నారు. యూసీఎఫ్ నిధుల్లో రూ.630 కోట్లతో 40 అడుగులు, అంతకంటే ఎక్కువ వెడల్పుతో 50 కిలోమీటర్ల మేర మోడల్ రోడ్లను నిర్మించనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. జిల్లా కోర్టు, సివిల్ ఆసుపత్రి, గీతాభవన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామని, కరీంనగర్ బస్‌స్టేషన్ వద్ద హైదరాబాద్ ఉప్పల్ తరహాలో స్కైవాక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నగరంలోని ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లను గుర్తించి వాటిని సుందరంగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
80 కి.మీ మేర డ్రెయిన్లు
చిన్నపాటి వర్షానికే నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 80 కిలోమీటర్ల మేర స్టార్మ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించినట్లు చెప్పారు. ఇందుకోసం సుమారు రూ.130 కోట్ల వ్యయం చేయనున్నట్లు పేర్కొన్నారు. నగరంలో కాలుష్యరహిత రవాణాను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా 130 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.
డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం
కరీంనగర్‌లో ప్రధాన సమస్యగా మారిన డంపింగ్ యార్డు అంశానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని బండి సంజయ్ చెప్పారు. రూ.80 కోట్లతో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. నగరంలో సేకరించిన చెత్తను బదిలీ కేంద్రానికి తరలించి, ప్రాసెసింగ్ యూనిట్‌లో తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి రీసైకిల్ చేయడంతోపాటు మిగిలిన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో పారవేసేలా సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి గత ఏడేళ్లలో రూ.22 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసినట్లు బండి సంజయ్ తెలిపారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని నగర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sudden Sweating | వ్యాయామం చేయకున్నా చెమటలు అతిగా పడుతున్నాయా.. జాగ్రత్త, అది గుండె పోటుకు సంకేతం కావచ్చు..
- ●Singireddy Niranjan Reddy | ప్రశ్నిస్తారనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
- ●Stock Markets | పశ్చిమ ఆసియాలో పెరిగిన యుద్ధ తీవ్రత.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●ACB Raids | ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి
- ●Prof. CNR Rao | పేరులో ఎక్స్ట్రా 'F'.. భారతరత్న సీఎన్ఆర్ రావుకు ఈసీ నోటీసులు
- ●Mallu Ravi | కేటీఆర్‌పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవిడెన్స్ సేకరించండి

Sudden Sweating | వ్యాయామం చేయకున్నా చెమటలు అతిగా పడుతున్నాయా.. జాగ్రత్త, అది గుండె పోటుకు సంకేతం కావచ్చు..

Singireddy Niranjan Reddy | ప్రశ్నిస్తారనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Stock Markets | పశ్చిమ ఆసియాలో పెరిగిన యుద్ధ తీవ్రత.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ACB Raids | ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి






