Chamala Kirankumar Reddy | కాంగ్రెస్ శ్రేణులారా.. వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్‌కు ధీటైన జవాబిద్దాం
Chamala Kirankumar Reddy | కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల ప్రజా పాలన ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న వారం రోజుల కార్యక్రమాలకు కాంగ్రెస్ శ్రేణులు ధీటైన జవాబివ్వాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పదేళ్లు అధికార దుర్వినియోగం చేసి, ఇప్పుడు ప్రతిపక్ష నేత పదవిని కూడా నిరుపయోగంగా మారుస్తున్నారని విమర్శించారు.
- ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఒక్కరోజు కూడా అసెంబ్లీ చర్చల్లో పాల్గొనలే.. ఆ పదవినీ దుర్వినియోగం చేస్తుండు
- ఇప్పటికైనా దళిత ఎమ్మెల్యేకు ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి
- అప్పుడే మా పాలనపై మీరు మాట్లాడే అర్హత ఉంటుంది
- భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి హితవు
Chamala Kirankumar Reddy | త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల ప్రజా పాలన ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న వారం రోజుల కార్యక్రమాలకు కాంగ్రెస్ శ్రేణులు ధీటైన జవాబివ్వాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులకు ఆయన విన్నవించారు. కేసీఆర్ పదేళ్లు అధికార దుర్వినియోగం చేసి, ఇప్పుడు ప్రతిపక్ష నేత పదవిని కూడా నిరుపయోగంగా మారుస్తున్నారని విమర్శించారు. దళిత ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇస్తే మా వెయ్యి రోజుల పరిపాలనపై మాట్లాడే అర్హత ఉంటుందన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నేత పదవి నుంచి దిగిపోవాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేయాలని చామల పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన సోమవారం మాట్లాడారు.
కేసీఆర్ వెయ్యి రోజులుగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి ఒక్క రోజు అసెంబ్లీ చర్చలో పాల్గొనలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్లు ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశారో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత పదవిని దుర్వినియోగం చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని అధికారంలోకి రాగానే తానే సీఎం అయ్యారు. కేసీఆర్ కేవలం హాస్పిటల్స్‌లో పరామర్శలకు పరిమితం అయ్యారు.
పదేళ్ళు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. కేసీఆర్ ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో దళిత ఎమ్మెల్యేకు ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి. దళిత ఎమ్మెల్యేకు ఆ అవకాశం ఇస్తే కాంగ్రెస్ వెయ్యి రోజుల పరిపాలనపై మాట్లాడే అర్హత మీకు ఉంటుంది. వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ భాగస్వామ్యం కాలేదు. బీఆర్ఎస్ పార్టీ 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మ్యానిఫెస్టోను అధ్యయనం చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. ఇక కాంగ్రెస్ శ్రేణులు వెయ్యి రోజుల ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ప్రజా పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు.
సంబంధిత వార్తలు

Manne Krishank | ఇజ్రాయెల్ అధికారితో కొండల్ రెడ్డి ఏం హోదాలో భేటీ అయిండు.. రేవంత్ సమాధానం చెప్పాలి
ఆగస్టు 31, 2026

Errolla Srinivas | అడ్లూరి లక్ష్మణ్ కాదు.. అబద్దాల లక్ష్మణ్‌గా మారిపోయిండు
ఆగస్టు 31, 2026

Driving Licence | మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్.. ఇకపై ఆ పాఠాలు వినాల్సిందే!
ఆగస్టు 31, 2026
తాజావార్తలు
- ●Kayadu Lohar | తమిళ ఇండస్ట్రీ అంటే అంత చిన్నచూపా? - కయదు లోహర్‌పై ఫ్యాన్స్ ఫైర్
- ●US MQ-9 Reaper | ఫైటర్ జెట్ కంటే ఖరీదైన అమెరికా 'MQ-9 రీపర్' డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్.. మరి భారత్ వద్ద ఉన్న డ్రోన్ల సంగతేంటి?
- ●Manne Krishank | ఇజ్రాయెల్ అధికారితో కొండల్ రెడ్డి ఏం హోదాలో భేటీ అయిండు.. రేవంత్ సమాధానం చెప్పాలి
- ●Delhis Draft Electoral Roll | ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి 47.7 లక్షల పేర్లు తొలగింపు
- ●Horror Movie | కిరణ్ అబ్బవరం సినిమాలో బిగ్‌బాస్ తెలుగు రన్నరప్ - హారర్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ
- ●Glacier Collapse Video | కళ్లముందే కరిగిపోయిన మంచుకొండ.. నేపాల్ వరదల భయానక దృశ్యాలు డ్రోన్‌లో రికార్డ్

Kayadu Lohar | తమిళ ఇండస్ట్రీ అంటే అంత చిన్నచూపా? - కయదు లోహర్‌పై ఫ్యాన్స్ ఫైర్

US MQ-9 Reaper | ఫైటర్ జెట్ కంటే ఖరీదైన అమెరికా 'MQ-9 రీపర్' డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్.. మరి భారత్ వద్ద ఉన్న డ్రోన్ల సంగతేంటి?

Manne Krishank | ఇజ్రాయెల్ అధికారితో కొండల్ రెడ్డి ఏం హోదాలో భేటీ అయిండు.. రేవంత్ సమాధానం చెప్పాలి

Delhis Draft Electoral Roll | ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి 47.7 లక్షల పేర్లు తొలగింపు



