Cardiac Arrest | క్లాస్ రూమ్‌లో కుప్పకూలి.. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి
Cardiac Arrest | ఉత్తరప్రదేశ్ లక్నోలో విషాదం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో (Cardiac Arrest) క్లాస్‌రూమ్‌లోనే (classroom) కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడం కలవరానికి గురి చేస్తోంది.
Cardiac Arrest | త్రినేత్ర న్యూస్ : గుండెపోటు (Cardiac Arrest) మరణాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్నారులు కూడా హార్ట్‌ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలే అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నో (Lucknow)లో విషాదం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో క్లాస్‌రూమ్ (classroom)లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడం కలవరానికి గురి చేస్తోంది.
8వ తరగతి చదువుతున్న బాలుడు (Class 8 student) ఎప్పటిలానే ఉదయం పాఠశాలకు వెళ్లాడు. ఎంతో ఉత్సాహంగా క్లాస్ రూమ్‌లోకి అడుగుపెట్టాడు. అంతే ఉన్నట్టుండి ఒక్కసారిగా నేలపై కుప్పకూలి పడిపోయాడు. ఏం జరిగిందో అర్థంకాక విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం షాక్‌లో ఉండిపోయింది. ఈ విషయంపై తల్లిదండ్రులకు సమాచారం అందించిన సిబ్బంది.. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధరించారు. గుండెపోటుతో చిన్నారి మరణించినట్లు వెల్లడించారు. వైద్యుల మాటలు విన్న పాఠశాల యాజమాన్యం, విద్యార్థి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. కాగా, అక్టోబర్ 31న కూడా యూపీలోని ముజఫర్‌నగర్ పాఠశాలలో 10 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వారం వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు రెండు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
పంజాబ్‌లో పంట వ్యర్థాల దగ్ధం తీవ్రరూపం.. 2,787 ఘటనలు, రూ.46.10 లక్షల ఫైన్
తెలంగాణ పోలీసులకు శుభవార్త.. 90 వేల మందికి ఆరోగ్య పరీక్షలు
సూర్యాస్తమయం తర్వాత అడవిలో ఆడుగుపెడితే మరణమే - సైలెంట్‌గా ఓటీటీలోకి తమన్నా హారర్ మూవీ
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Videocon | వీడియోకాన్ మాజీ అధినేత దివాలా.. ఎస్బీఐ రూ.12,668 కోట్ల రికవరీ..
- ●Stubble Burning | పంజాబ్‌లో పంట వ్యర్థాల దగ్ధం తీవ్రరూపం.. 2,787 ఘటనలు, రూ.46.10 లక్షల ఫైన్
- ●Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో దీపావళి ధమాకా.. సెన్సెక్స్, నిఫ్టీ50 బుల్ ర్యాలీ..
- ●Jagtial | కాటేసిన కాంటా! పది నెలల పసిపాప బలి
- ●Vemulawada Graveyard Shelter | కొడుకు వైద్యం కోసం రూ.10 లక్షల అప్పు.. చివరికి బతకడానికి శ్మశానమే దిక్కు
- ●Chirumarthi Lingaiah | సాగర్ ఎక్కడ.. కుప్పం ఎక్కడ? 72 టీఎంసీల నీళ్లు పోతుంటే ఏం చేస్తున్నారు?

Videocon | వీడియోకాన్ మాజీ అధినేత దివాలా.. ఎస్బీఐ రూ.12,668 కోట్ల రికవరీ..

Stubble Burning | పంజాబ్‌లో పంట వ్యర్థాల దగ్ధం తీవ్రరూపం.. 2,787 ఘటనలు, రూ.46.10 లక్షల ఫైన్

Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో దీపావళి ధమాకా.. సెన్సెక్స్, నిఫ్టీ50 బుల్ ర్యాలీ..

Jagtial | కాటేసిన కాంటా! పది నెలల పసిపాప బలి






