త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Videocon | వీడియోకాన్ మాజీ అధినేత దివాలా.. ఎస్‌బీఐ రూ.12,668 కోట్ల రికవరీ..

Videocon | వీడియోకాన్ గ్రూప్ మాజీ ప్రమోటర్ వేణుగోపాల్ ఎన్. ధూత్ దివాళా తీసిన‌ట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ప్రకటించింది. వ్యక్తిగత రుణ హామీలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కి చెల్లించాల్సిన రూ.12,668 కోట్ల బకాయిల వసూలు కోసం దాఖలైన పిటిషన్‌ను ట్రిబ్యునల్ ఆమోదించింది.

S

Business | Published On Nov 6, 2026, 4.17 pm IST

Videocon | వీడియోకాన్ మాజీ అధినేత దివాలా.. ఎస్‌బీఐ రూ.12,668 కోట్ల రికవరీ..
Advertisement

Videocon | వీడియోకాన్ గ్రూప్ మాజీ ప్రమోటర్ వేణుగోపాల్ ఎన్. ధూత్ దివాళా తీసిన‌ట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ప్రకటించింది. వ్యక్తిగత రుణ హామీలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కి చెల్లించాల్సిన రూ.12,668 కోట్ల బకాయిల వసూలు కోసం దాఖలైన పిటిషన్‌ను ట్రిబ్యునల్ ఆమోదించింది. రుణ చెల్లింపుల కోసం ఆయన ప్రతిపాదించిన రూ.600 కోట్ల పరిష్కార ప్రణాళికను రుణదాతలు తిరస్కరించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

రూ.12,668 కోట్ల రిక‌వ‌రీ..

వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు సంబంధించి వ్యక్తిగత హామీలు (పర్సనల్ గ్యారెంటీలు) అందించిన ధూత్ నుంచి రూ.12,668 కోట్లకు పైగా బకాయిలను వసూలు చేసేందుకు ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని ఎన్‌సీఎల్‌టీ ధర్మాసనం ఆమోదించింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)లోని సెక్షన్ 123 కింద ఈ నిర్ణయం తీసుకుంది. ధూత్ వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియ విఫలమైన నేపథ్యంలో ఈ చర్య చేపట్టింది. దివాలా ట్రస్టీగా ఆశిష్ నారాయణ్‌ను నియమిస్తూ, ధూత్‌కు చెందిన ఆస్తుల నిర్వహణ, రుణదాతలకు బకాయిల పంపిణీ బాధ్యతలను ఆయనకు అప్పగించింది.

రూ.600 కోట్ల చెల్లింపు ప్ర‌తిపాద‌న తిర‌స్క‌ర‌ణ‌..

ఎస్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 30 నాటికి వడ్డీలు, జరిమానాలతో కలిపి ధూత్ చెల్లించాల్సిన మొత్తం రూ.12,668.06 కోట్లుగా ఉంది. వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్ సహా గ్రూప్ కంపెనీలకు అందించిన టర్మ్ లోన్లు, వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, ఇతర అప్పులకు ధూత్ వ్యక్తిగత హామీలు ఇచ్చారు. గ్రూప్ రుణాల చెల్లింపుల్లో విఫలమైన నేపథ్యంలో 2018 ఫిబ్రవరిలో ఎస్‌బీఐ ఆ హామీలను అమలు చేసింది. వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా సిలిగురిలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ద్వారా మూడేళ్లలో రూ.600 కోట్లు చెల్లిస్తానని ధూత్ ప్రతిపాదించారు. అయితే, ఇది రుణదాతలు ఆమోదించిన క్లెయిమ్‌లలో ఒక శాతం కంటే తక్కువ కావడంతోపాటు, భవిష్యత్తులో ప్రాజెక్టుకు అనుమతులు రావడం, ఆదాయం సమకూరడంపై ఆధారపడి ఉండడంతో రిజల్యూషన్ ప్రొఫెషనల్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముందస్తు చెల్లింపు కూడా లేకపోవడంతో రుణదాతలు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.

దీంతో ఈ ఏడాది జూలైలో ట్రిబ్యునల్ వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియను ముగించి, రుణదాతలు దివాలా చర్యలు ప్రారంభించేందుకు అనుమతించింది. అనంతరం ఎస్‌బీఐ నిర్ణీత గడువులోగా పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా నియమితులైన దివాలా ట్రస్టీ ధూత్‌కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుని నిర్వహించడంతోపాటు, రుణదాతల నుంచి క్లెయిమ్‌లను స్వీకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక నివేదికను 90 రోజుల్లోగా ట్రిబ్యునల్‌కు సమర్పించాలని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది.

Advertisement
Advertisement