త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murder | ప్రేమ ఒక‌రితో.. నిశ్చితార్థం మ‌రొక‌రితో.. ప్రియుడి చేతిలో యువ‌తి దారుణ‌హ‌త్య

Murder | ప్రేమ ఒక‌రితో.. వివాహం మ‌రొక‌రితో.. ఓ యువ‌కుడిని ప్రేమించిన యువ‌తి.. మ‌రొక‌రితో పెండ్లికి సిద్ధ‌మైంది. నిశ్చితార్ధం కూడా చేసుకుంది. విష‌యం తెలుసుకున్న ప్రియుడు (Lover).. ఆమెను గొంతు పిసికి చంపేశాడు (Murder).

G

National | Published On Nov 6, 2026, 8.17 am IST

Murder | ప్రేమ ఒక‌రితో.. నిశ్చితార్థం మ‌రొక‌రితో.. ప్రియుడి చేతిలో యువ‌తి దారుణ‌హ‌త్య
Advertisement

Murder | త్రినేత్ర న్యూస్‌: ప్రేమ ఒక‌రితో.. వివాహం మ‌రొక‌రితో.. ఓ యువ‌కుడిని ప్రేమించిన యువ‌తి.. మ‌రొక‌రితో పెండ్లికి సిద్ధ‌మైంది. నిశ్చితార్ధం కూడా చేసుకుంది. విష‌యం తెలుసుకున్న ప్రియుడు (Lover).. ఆమెను గొంతు పిసికి చంపేశాడు (Murder). ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని (Uttar Pradesh) మీర‌ట్‌లో జ‌రిగింది.

మీర‌ట్‌కు చెందిన స‌మ్రీన్ (25) ఫ‌తేవుల్లాపూర్‌లోని ఓ కాల్ సెంట‌ర్‌లో (Call Center,) ప‌నిచేస్తున్న‌ది. ఈ క్ర‌మంలో ఫిరోజ్ అనే వ్య‌క్తితో ప‌రిచ‌యం అయింది. అదికాస్తా ప్రేమ‌గా మ‌ర‌డంతో ఇద్ద‌రు క‌లిసి తిరిగారు. అయితే కుటుంబ స‌భ్యులు స‌మ్రీన్‌కు మ‌రో వ్య‌క్తితో వివాహం నిశ్చ‌యం చేశారు. అతనితో నిశ్చితార్థం కూడా జ‌రిపించారు. విష‌యం తెలుసుకున్న ఫిరోజ్‌.. ఒకసారి క‌ల‌వాల‌ని స‌మ్రీన్‌ను పిలిచాడు. దీంతో ఆమె సోద‌రుడు ఆఫీస్ వ‌ద్ద వ‌దిలివెళ్లాడు.

పెండ్లి విష‌య‌మై స‌మ్రీన్‌, ఫిరోజ్ మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఫిరోజ్ ఆమె గొంతు పిసికి హత్య (Strangled) చేశాడు. అనంతరం సమ్రీన్ మృతదేహాన్ని బిజ్లీ బంబా బైపాస్‌లోని అటవీ ప్రాంతంలో పడేసి పోలీసులకు ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు పర్తాపూర్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement