త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Police | తెలంగాణ పోలీసుల‌కు శుభ‌వార్త‌.. 90 వేల మందికి ఆరోగ్య ప‌రీక్ష‌లు

Telangana Police | తెలంగాణ పోలీసుల‌కు డీజీపీ సీవీ ఆనంద్( DGP CV Anand ) శుభ‌వార్త వినిపించారు. త్వ‌ర‌లోనే 90 వేల మంది పోలీసుల‌కు ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. పోలీసుల ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టి సారించిన పోలీసు శాఖ‌.. ఇప్ప‌టికే అమ‌ల‌వుతున్న ఫిట్ కాప్( FitCop ) కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్త‌రించేందుకు సిద్ధ‌మైంది.

S

Telangana | Published On Nov 6, 2026, 4.46 pm IST

Telangana Police | తెలంగాణ పోలీసుల‌కు శుభ‌వార్త‌.. 90 వేల మందికి ఆరోగ్య ప‌రీక్ష‌లు
Advertisement

Telangana Police | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ పోలీసుల‌కు డీజీపీ సీవీ ఆనంద్( DGP CV Anand ) శుభ‌వార్త వినిపించారు. త్వ‌ర‌లోనే 90 వేల మంది పోలీసుల‌కు ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. పోలీసుల ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టి సారించిన పోలీసు శాఖ‌.. ఇప్ప‌టికే అమ‌ల‌వుతున్న ఫిట్ కాప్( FitCop ) కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్త‌రించేందుకు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం డీజీపీ సీవీ ఆనంద్ సీనియ‌ర్ అధికారుల‌తో పాటు యాప్ డెవ‌ల‌ప‌ర్స్‌తో స‌మావేశ‌మై చ‌ర్చించారు.

90 వేల మంది పోలీసులకు ఆరోగ్య పరీక్షలు

తెలంగాణ పోలీసు శాఖ‌లో ప్ర‌స్తుతం 90 వేల మంది పోలీసులు విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. వీరంద‌రికి ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. మొద‌టి ద‌శ‌లో బీఎంఐ, ఎత్తు, బ‌రువు, ర‌క్త‌పోటు, డ‌యాబెటిస్ వంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి డేటాను భ‌ద్ర‌ప‌రుస్తారు. ఎప్ప‌టిక‌ప్పుడు యాప్‌లో కూడా న‌మోదు చేస్తారు. ఇక ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న పోలీసులను గుర్తించి.. కాల్ సెంట‌ర్ ద్వారా సంబంధిత ఉద్యోగికి ఫోన్ చేసి సూచ‌న‌లు చేస్తారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తగిన వైద్య మార్గదర్శకత్వం కల్పిస్తారు.

ఫిట్ కాప్‌కు ప‌దేళ్ల స‌హ‌కారం

పోలీసుల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు ఏర్పాటు చేసిన ఫిట్ కాప్ కార్య‌క్ర‌మానికి మంచి స్పంద‌న రావ‌డంతో.. ప‌దేళ్ల పాటు స‌హ‌కారం అందించేందుకు ఒక స్పాన్స‌ర్ ముందుకు వ‌చ్చిన‌ట్లు సీవీ ఆనంద్ తెలిపారు. ప‌దేళ్ల పాటు అవ‌స‌ర‌మైన నిధులు స‌మకూర్చేందుకు స‌ద‌రు సంస్థ ముందుకు వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. యాప్‌లో పొందుపరచాల్సిన ఆరోగ్య ప్రమాణాలు, అవసరమైన సదుపాయాలు, సాంకేతిక అంశాలు, ఒప్పందం (ఎంఓయూ), అమలు ప్రణాళికపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు.

40–45 రోజుల్లో ప్రారంభానికి సన్నాహాలు

యాప్‌ ప్రారంభమైన తర్వాత గరిష్ఠంగా 40–45 రోజుల్లో కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సీవీ ఆనంద్‌ తెలిపారు. పోలీసుల ఆరోగ్యాన్ని కేవలం నమోదు చేయడమే కాకుండా, ప్రతి ఒక్కరూ మెరుగైన ఆరోగ్యంతో జీవించేలా సహకరించడమే ఫిట్‌కాప్‌ ప్రధాన ఉద్దేశమని వివరించారు. సిబ్బంది ఆరోగ్యం మెరుగుపడితే విధి నిర్వహణ సామర్థ్యం కూడా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement