Jupally Krishna Rao | ఎల్‌నినో ఎఫెక్ట్.. బీర్ల ఉత్పత్తిపై లేనే లేదు
Jupally Krishna Rao | ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల రాష్ట్రంలో బీర్ల ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేనే లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ రెండున్నరేండ్ల కాలంలో తాగుడు పెరగలేదని ఆయన పేర్కొన్నారు.
మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి జూపల్లి
Jupally Krishna Rao | త్రినేత్ర న్యూస్ : ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల రాష్ట్రంలో బీర్ల ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేనే లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ రెండున్నరేండ్ల కాలంలో తాగుడు పెరగలేదని ఆయన పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో మీడియాతో జూపల్లి కృష్ణారావు చిట్ చాట్ చేశారు.
ఫ్యూర్, క్యూర్‌తో పాటు సిటీ పరిధిలో 40 వైన్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక మద్యం ధరలు పెంచలేదు. మిగతా రాష్ట్రాల మాదిరే రేట్లు ఉన్నయ్. అయితే మందును విచ్చలవిడిగా పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. 2014లో రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం రూ. 10 వేల కోట్లు ఉంటే.. 2023 డిసెంబర్ 7 వరకు రూ. 35 వేల కోట్లకు ఎగబాకింది. పదేండ్లలో 260 శాతం ఆదాయం పెరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 శాతం అంటే రూ. 4 వేల కోట్లు మాత్రమే పెరిగింది. ఇక ట్యాక్స్‌ల విషయానికి వస్తే పక్క రాష్ట్రంలో ఉన్న ట్యాక్స్‌లే అమలవుతున్నాయని మంత్రి తెలిపారు.
ఫ్రీ కరెంట్ ఇవ్వమని వైఎస్సార్‌కు చెప్పింది నేనే
రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వమని రాజశేఖర్ రెడ్డికి చెప్పింది తానేనని జూపల్లి పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వారిలో తాను కూడా ఒకడిని. ఇక బీఆర్ఎస్ ఆస్తులపై విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయ్యాక కమిటీ రిపోర్టు బయటకు వస్తుంది. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ లాగ రిపీట్ కాబోతోంది. నేను ఐదుగురు ముఖ్యమంత్రుల క్యాబినెట్‌లో పని చేశాను. 2004లో నాకు టికెట్ ఇవ్వలేదు, ఇండిపెండెంట్‌గా పోటీ చేశాను. నేను ఓడిపోయి పదవులు అడిగేవాడిని కాదు. నేను కంఫర్ట్ కోసం రాజకీయాల్లోకి రాలేదు. వ్యాపారం చేసి రాజకీయాల్లోకి వచ్చాను అని జూపల్లి కృష్ణారావు తెలిపారు.
తాజావార్తలు
- ●Rahul Ramakrishna | రాహుల్ రామకృష్ణ సూపర్ హిట్ కామెడీ మూవీకి సీక్వెల్ - హీరోగా మహేష్‌బాబు మేనల్లుడు
- ●Man Remanded to Judicial Custody | అకారణంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. వ్యక్తికి రిమాండ్ విధించిన కోర్టు
- ●Bhatti Vikramarka | 8 వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు
- ●Indira Shobhan | ఖబడ్దార్ కేటీఆర్, హరీష్ రావు
- ●OpenAI | చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. ఇక జనరేట్ చేసిన టెక్ట్స్‌ను కూడా గుర్తించొచ్చు..
- ●Jaya Bachchan | విలేకరుని కసురుకున్న జయా బచ్చన్.. మైక్‌ను పక్కకు నెట్టేసి

Rahul Ramakrishna | రాహుల్ రామకృష్ణ సూపర్ హిట్ కామెడీ మూవీకి సీక్వెల్ - హీరోగా మహేష్‌బాబు మేనల్లుడు

Man Remanded to Judicial Custody | అకారణంగా ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. వ్యక్తికి రిమాండ్ విధించిన కోర్టు

Bhatti Vikramarka | 8 వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు

Indira Shobhan | ఖబడ్దార్ కేటీఆర్, హరీష్ రావు



