Indian sailor | ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. గుజరాత్ నావికుడు మృతి
Indian sailor | ఒమన్ తీరంలో (coast of Oman) భారత జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంఎస్‌వి అల్ జుసుఫీ’ (MSV Al Jusufi) కార్గో నౌకపై (India-flagged cargo ship) జరిగిన దాడిలో.. గుజరాత్‌కు చెందిన నావికుడు (Gujarat sailor) గంధర్ నహిమ్ అజీజ్‌గా (Gandhar Nahim Ajij) ప్రాణాలు కోల్పోయాడు.
Indian sailor | త్రినేత్ర న్యూస్ : ఒమన్ తీరంలో (coast of Oman) భారత జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంఎస్‌వి అల్ జుసుఫీ’ (MSV Al Jusufi) కార్గో నౌకపై (India-flagged cargo ship) దాడి జరిగింది. ఈ దాడిలో భారతీయ సెయిలర్ (Indian sailor) ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ (Union Shipping Minister Sarbananda Sonowal) తాజాగా వెల్లడించారు. ఈ నౌకపై గుర్తుతెలియని డ్రోన్ దాడి చేసినట్లు పేర్కొన్నారు.
ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 14 మంది భారతీయ నావికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి 13 మంది సురక్షితంగా బయటపడగా.. వారిని ఒమన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. మృతుడు గుజరాత్‌కు (Gujarat sailor) చెందిన గంధర్ నహిమ్ అజీజ్‌గా (Gandhar Nahim Ajij) గుర్తించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఈ మేరకు దాడి పట్ల కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
నావికుల భద్రతపై ఆందోళన
గల్ఫ్ ప్రాంతంలోని కీలక సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో భారతీయ నావికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ కనీసం 20 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్ల ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో 14 మంది నావికులే కావడం గమనార్హం. దీంతో ఆ మార్గంలో నావికుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
సముద్ర మార్గాల్లో పెరుగుతున్న ముప్పు
హర్మూజ్ జలసంధి ప్రాంతం మధ్యప్రాచ్య సంఘర్షణలకు ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. దీంతో వాణిజ్య నౌకలపై క్షిపణి, డ్రోన్ దాడి ఘటనలు విపరీతంగా పెరిగాయి. సముద్ర మార్గంలో నావికుల భద్రతకు భంగం కలిగించే హింసాత్మక చర్యలను భారత్ నిరంతరం ఖండిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రాణనష్టాన్ని నివారించడానికి హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల్లో భారతీయ పౌరులను నియమించడాన్ని న్యూ ఢిల్లీ నిషేధించింది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం చట్టవిరుద్ధమైనప్పటికీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భద్రతా సంక్షోభం తీవ్రరూపం దాల్చింది.
Also Read..
రెండు హెలికాప్టర్లు ఢీ.. భారతీయుడు మృతి
ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. పసిడిపై ఆసక్తి తగ్గుతుందా..?
పిల్లల భవిష్యత్తు కోసం రూ.30 లక్షలు.. ఎల్ఐసీ పాలసీలతో సాధ్యమేనా..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Strait of Hormuz | హర్మూజ్‌లో వాణిజ్య నౌకపై దాడి.. 11 మంది భారతీయులకు గాయాలు
అక్టోబర్ 6, 2026

flydubai attacker | ఉగ్రవాద భావజాలం.. విమానాలు నడపడంపై నిషేధం.. ఫ్లైదుబాయ్ కో-పైలట్ గురించి సంచలన విషయాలు
అక్టోబర్ 3, 2026

Karnataka man murdered | యూఏఈలో భారతీయ వ్యక్తి దారుణ హత్య.. మృతదేహాన్ని తొమ్మిది ముక్కలు చేసి
సెప్టెంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Baththa Movie Review | పెద్ద రౌడీ వాష్‌రూమ్‌లో ఎనిమిది రోజులు చిక్కుకుపోతే...విజయ్ సేతుపతి బత్తా మూవీ ఎలా ఉందంటే?
- ●Helicopters Collide In Nepal | రెండు హెలికాప్టర్లు ఢీ.. భారతీయుడు మృతి
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. పసిడిపై ఆసక్తి తగ్గుతుందా..?
- ●LIC | పిల్లల భవిష్యత్తు కోసం రూ.30 లక్షలు.. ఎల్ఐసీ పాలసీలతో సాధ్యమేనా..?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోరు.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
- ●Komatireddy Rajagopal Reddy | అధికారంలో ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేలాగా నిధులు అడగాల్సి వస్తుంది

Baththa Movie Review | పెద్ద రౌడీ వాష్‌రూమ్‌లో ఎనిమిది రోజులు చిక్కుకుపోతే...విజయ్ సేతుపతి బత్తా మూవీ ఎలా ఉందంటే?

Helicopters Collide In Nepal | రెండు హెలికాప్టర్లు ఢీ.. భారతీయుడు మృతి

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. పసిడిపై ఆసక్తి తగ్గుతుందా..?

LIC | పిల్లల భవిష్యత్తు కోసం రూ.30 లక్షలు.. ఎల్ఐసీ పాలసీలతో సాధ్యమేనా..?



